Putin ని విమర్శించి... మారువేషంలో దేశం నుంచీ తప్పించుకున్న... Russian సింగర్!

ABN , First Publish Date - 2022-05-12T23:11:31+05:30 IST

రష్యా అధ్యక్షుడు Vladimir Putin ని తీవ్రంగా విమర్శించి... అందరి దృష్టినీ ఆకర్షించిన ‘పుసీ రయాట్’ మ్యూజిక్ బ్యాండ్ సభ్యురాలు Maria Alyokhina పోలీసుల కళ్లుగప్పి విదేశానికి వెళ్లిపోయింది. ఆమె ‘ఫుడ్ కొరియర్’గా మారువేషం ధరించి తప్పించుకున్నట్టు సమాచారం...

Putin ని విమర్శించి... మారువేషంలో దేశం నుంచీ తప్పించుకున్న... Russian సింగర్!

రష్యా అధ్యక్షుడు Vladimir Putin ని తీవ్రంగా విమర్శించి... అందరి దృష్టినీ ఆకర్షించిన ‘పుసీ రయాట్’ మ్యూజిక్ బ్యాండ్ సభ్యురాలు Maria Alyokhina పోలీసుల కళ్లుగప్పి విదేశానికి వెళ్లిపోయింది. ఆమె ‘ఫుడ్ కొరియర్’గా మారువేషం ధరించి తప్పించుకున్నట్టు సమాచారం... 


2012లో మొదటి సారి మారియా అలియోకినా, ఆమె సహచర Pussy Riot సభ్యులు వార్తల్లోకి ఎక్కారు. వారు మాస్కోలోని ప్రఖ్యాత ‘క్రైస్ట్ ద సేవియర్’ క్యాథడ్రల్ లో పుతిన్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. దాంతో వారిపై రష్యన్ అధికారుల నిఘా పెరిగింది... 


మారియా అలియోకినా సహా ఆమె బ్యాండ్ లోని మ్యూజీషియన్స్, సింగర్స్ అంతా రెండేళ్ల పాటూ జైలు జీవితం గడిపారు. అయినా రష్యన్ ప్రెసిడెంట్ పై వారు నిప్పులు చెరగటం మానలేదు. ముఖ్యంగా, అలియోకినా పుతిన్ లాంటి అగ్రనేతకు వ్యతిరేకంగా తన పోరుని నిర్భయంగా కొనసాగిస్తోంది. 


గతంలో దేశాధ్యక్షుడ్ని విమర్శించినందుకు మారియా అలియోకినాని జైల్లో ఉంచగా విడుదలైన వెంటనే ఆమె మరోమారు గళమెత్తింది. అంతేకాదు, రష్యాలోని ‘నేరము-శిక్ష’ అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తూ ఓ వార్త సంస్థని కూడా ఆమె ప్రారంభించింది. ‘మీడియాజోనా’ ఆ న్యూస్ ఏజెన్సీ పేరు... 


ఏప్రెల్ నెలలో ఆమెని రష్యన్ అధికారులు హౌజ్ అరెస్ట్  కూడా చేశారు. ఉక్రెయిన్ పై సైనిక చర్యకు పూనుకున్న పుతిన్ కు వ్యతిరేకంగా గళమెత్తిన వారందర్నీ నియంత్రించే క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మారియా అలియోకినా 21 రోజులు ‘పీనల్ కాలనీ’లోనూ ఉండాల్సి వచ్చింది. పీనల్ కాలనీ అంటే కొందరు ప్రత్యేకమైన నేరస్థుల్ని జన సామాన్యకి దూరంగా, నగరానికి ఆవల ఉంచటం. అటువంటి కఠినమైన శిక్షని కూడా ఆమె భరించాల్సి వచ్చింది. 


33 ఏళ్ల మారియా అలియోకినా తనపై రష్యన్ ప్రభుత్వ నిఘా అంతకంతకూ పెరుగుతుండటంతో తాజాగా దేశం నుంచీ తప్పించుకుంది. ఆమె ఫుడ్ డెలివరీ చేసే వర్కర్ గా మారువేషంలో పోలీసుల కన్నుగప్పి రష్యా దాటి వెళ్లిపోయింది. ఐస్ ల్యాండ్ కు చెందిన మరో ఆర్టిస్ట్ సాయంతో ట్రావెల్ డాక్యుమెంట్స్ సంపాదించిన అలియోకినా సేఫ్ గా లితువేనియా దేశంలోకి ప్రవేశించినట్టు సమాచారం. 


మ్యూజిక్ బ్యాండ్ ‘పుసీ రయాట్’ లీడర్ అలియోకినా పుతిన్ పాలనలోని రష్యా నుంచీ బయటపడిన వెంటనే ఘాటుగా స్పందించింది. ‘‘రష్యా ఇకపై ఎంత మాత్రం మనుగడ సాగించటానికి వీలు లేదని నేను భావిస్తున్నాను...’’ అందామె! ఉక్రెయిన్ పై ఎటువంటి విలువలు లేని రష్యా క్రూరంగా దాడి చేస్తోందని బ్రేవ్ అండ్ బోల్డ్ సింగర్ ఆరోపిస్తోంది... 

Updated Date - 2022-05-12T23:11:31+05:30 IST