ప్రముఖ Odia నటుడు రాయ్‌మోహన్ మృతి.. విచారణలో..

ABN , First Publish Date - 2022-06-26T15:07:46+05:30 IST

ప్రముఖ ఒడియా నటుడు రాయ్‌మోహన్ ‌పరిడా హఠాన్మరణం చెందారు. కమిషనరేట్ పోలీసులు భువనేశ్వర్‌లోని..

ప్రముఖ Odia నటుడు రాయ్‌మోహన్ మృతి.. విచారణలో..

ప్రముఖ ఒడియా నటుడు రాయ్‌మోహన్ ‌పరిడా (Raimohan Parida) హఠాన్మరణం చెందారు. కమిషనరేట్ పోలీసులు భువనేశ్వర్‌లోని పలాసుని ప్రాంతంలోని ఆయన ఇంటికి వెళ్లి విచారణ ప్రారంభించారు. నివేదికల ప్రకారం.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ నటుడు ఆత్మహత్య చేసుకోగా.. ఆయన మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. అయితే.. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. విచారణ తరువాత తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. కాగా.. ఆయన మరణం ఒడిశా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను షాక్‌కి గురి చేసింది. దీంతో అభిమానులతో పాటు రాయ్‌మెహన్‌తో  కలిసి పని చేసిన నటులు, పలువురు సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


‘సాగర్‌’ అనే ఒడియా సినిమా ద్వారా రాయ్‌మోహన్‌ పరిడా కెరీర్‌ ప్రారంభించారు. ఆయన 'బంధనా', 'అసిబు కెబే సాజి మో రాణి', 'తూ థీలే మో దారా కహకు', 'నీజా రే మేఘా మోతే', 'ఛటీ చిరిదేలే తూ', ‘కాళీశంకర్’, ‘తో బినా మో కహానీ అధా’, ‘తో పెయిన్ నెబి ము సాహే జనమా’, ‘దే మా శక్తి దే’, ‘రకాటే లేఖి నా’, ‘మో మన ఖలీ తుమారీ పెయిన్’, ‘ఉదండి సీతా’ వంటి అనేక హిట్ ఒడియా చిత్రాలతో సహా 100 పైగా సినిమాల్లో నటించారు. అంతేకాకుండా.. పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. అలాగే.. ఆయనకి నాటక రంగంతో కూడా పరిచయం ఉంది. పరిదా తన ప్రత్యేకమైన నటన, డైలాగ్ డెలివరీలో ఒడియా ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నాడు. అలాగే.. రాయ్‌మెహన్ 15కి పైగా బెంగాలీ భాషా చిత్రాలలో కూడా నటించారు.

Updated Date - 2022-06-26T15:07:46+05:30 IST