Mahesh Babu: రీ రిలీజ్‌లోనూ ‘పోకిరి’ రికార్డుల మోత..

ABN , First Publish Date - 2022-08-12T14:41:25+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), ఇలియానా (Ileana) జంటగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri jagannadh) రూపొందించిన మాస్ ఎంటర్‌టైనర్ పోకిరి (Pokiri).

Mahesh Babu: రీ రిలీజ్‌లోనూ ‘పోకిరి’ రికార్డుల మోత..

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), ఇలియానా (Ileana) జంటగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri jagannadh) రూపొందించిన మాస్ ఎంటర్‌టైనర్ ‘పోకిరి’ (Pokiri). ఇటీవల రీ రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు కూడా వసూళ్ళ పరంగా రికార్డుల మోత మోగించింది. దాదాపు 16 ఏళ్ళ క్రితం అంటే 2006లో వచ్చింది ‘పోకిరి’. అప్పటి వరకు మహేశ్ బాబుకి ఉన్న ఇమేజ్‌ను నాలుగు రెట్లు పెంచిన సినిమా ఇది. కంప్లీట్ పూరి మార్క్‌తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. దాదాపు 75 ఏళ్ళ నుంచి ఉన్న రికార్డులను మహేశ్ ఈ మూవీతో చెరిపేశారు. 


‘పోకిరి’ తర్వాత అటు పూరిని, ఇటు మహేశ్ బాబుని మళ్ళీ ఇలాంటి సినిమా ఎప్పుడు చేస్తారూ అని ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. అయితే, ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘పోకిరి’ చిత్రాన్ని 4కె డిజిటల్‌లో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా మళ్ళీ థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతుందని తెలిసినప్పటి నుంచే మహేశ్ అభిమానులు మొదలు పెట్టిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ‘పోకిరి’ రిలీజ్ స్పెషల్ షోస్ 375 కి పైగానే ప్రదర్శించారు. టాలీవుడ్‌లో ఇంత భారీ స్థాయిలో రీ రిలీజ్ అవడం అనేది ఆసక్తికరమైన విషయం.


ఇక ఈ సినిమా స్పెషల్ షోస్ ద్వారా మొత్తంగా 1.73 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం. ‘పోకిరి’ రీ రిలీజ్ రోజు ఎక్కడెక్కడ ఎంత రాబట్టింది అనే వివరాలు ఇలా ఉన్నాయి. 


Nizam 69,07,433

UA 24,89,638

Guntur 13,02,265

East 11,78,820

Ceded 13,36,902

Krishna 10,25,251

West 5,39,694

Nellore 4,41,752

ROI - 4,01,875

OS - 17,03,611/- 


Total = 1,73,27,241/-


ఈ సినిమాను ఇందిర ప్రొడక్షన్స్, వైష్ణో అకాడమీ సంస్థలపై మంజుల, పూరి జగన్నాథ్ కలిసి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. 


Updated Date - 2022-08-12T14:41:25+05:30 IST