కోట్లు విలువ చేసే కారులో STAR HERO... రోడ్డు పక్కన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపించింది... వెంటనే ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-11-15T16:58:16+05:30 IST

కార్తీక్ ఆర్యన్... ప్రస్తుతం బాలీవుడ్‌లోని యంగ్ హీరోస్‌లో మంచి ఊపు మీదున్న హ్యాండ్సమ్ యాక్టర్. చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో బిజిబిజీగా గడిపేస్తున్నాడు. అయితే, కార్తీక్ లెటెస్ట్ వీడియో ఒకటి, కొన్ని ఫోటోలతో సహా తెగ వైరల్ అవుతోంది. చూసిన నెటిజన్స్ బీ-టౌన్ స్టార్ హీరో సింప్లిసిటీకి ఆశ్చర్యపోతున్నారు...

కోట్లు విలువ చేసే కారులో STAR HERO... రోడ్డు పక్కన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపించింది... వెంటనే ఏం చేశాడంటే...

కార్తీక్ ఆర్యన్... ప్రస్తుతం బాలీవుడ్‌లోని యంగ్ హీరోస్‌లో మంచి ఊపు మీదున్న హ్యాండ్సమ్ యాక్టర్. చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో బిజిబిజీగా గడిపేస్తున్నాడు. అయితే, కార్తీక్ లెటెస్ట్ వీడియో ఒకటి, కొన్ని ఫోటోలతో సహా తెగ వైరల్ అవుతోంది. చూసిన నెటిజన్స్ బీ-టౌన్ స్టార్ హీరో సింప్లిసిటీకి ఆశ్చర్యపోతున్నారు...


కనీసం మూడు కోట్లకు పైగా విలువ చేసే తన ఖరీదైన లాంబోర్గిని కారులో కార్తీక్ ఆర్యన్ ముంబై రోడ్డు మీద వెళుతున్నాడు. ‘బిగ్ బాస్15’ షోలో అతిథిగా పాల్గొని ఆయన రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి వెనుదిరుగుతున్నాడు. అయితే, అంతలోనే రోడ్డు పక్కన ఓ చైనీస్ ఫాస్ట్ పుడ్ సెంటర్ కనిపించింది. ఇంకేముంది, కార్తీక్‌లోని కామన్ మ్యాన్ ఆవురావురంటూ నిద్ర లేచాడు. తానో బాలీవుడ్ స్టార్ అని కూడా మరిచిపోయి బండి దిగేశాడు. చైనీస్ ఫుడ్ సర్వ్ చేసే రోడ్ సైడ్ వ్యాన్ వద్ద నిలబడిపోయాడు. కార్తీక్‌తో పాటూ అతని ఫ్రెండ్ కూడా వీడియోలోనూ, ఫోటోస్‌లోనూ ఉన్నాడు! ఇద్దరు స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేశారు. 


కార్తీక్ ఆర్యన్ తన భారీ కారు ముందు భాగంపైన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పెట్టుకుని తినటం అతడి ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది. నిజానికి కొన్నేళ్ల కింద ఈ యంగ్ యాక్టర్ ఇంజనీరింగ్ చదివేందుకు గ్వాలియర్ నుంచీ ముంబై వచ్చాడు. అప్పుడు కేవలం ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి మాత్రమే. కార్తీక్ అప్పట్లో ఇలా రోడ్డు మీద ఎన్నోసార్లు ఫాస్ట్ ఫుడ్ తినేవాడు. కానీ, సినిమా హీరో అయ్యాక, కోట్లు సంపాదించాక కూడా రోడ్ సైడ్ ఫుడ్ తినటం... కాస్త ఆశ్చర్యకరమే! అందుకే, ఆయన సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు...     

Updated Date - 2021-11-15T16:58:16+05:30 IST