Naga shourya: లండన్‌లో ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’

ABN , First Publish Date - 2022-07-03T01:01:00+05:30 IST

నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌లో లండన్‌లోని సుందరమైన ప్రదేశాల్లో జరుగుతోంది.

Naga shourya: లండన్‌లో ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’

నాగశౌర్య (Naga shourya), మాళవిక నాయర్‌ (Malavika nair)జంటగా శ్రీనివాస్‌ అవసరాల (Srinivas avasarala) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phana Ammayi). పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌లో లండన్‌లోని సుందరమైన ప్రదేశాల్లో జరుగుతోంది. హీరోహీరోయిన్‌, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. లండన్‌ సెట్‌లో సందడిచేస్తున్న టీమ్‌ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ‘‘గతంలో నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే! నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఊహలు గుసగుసలాడే, ‘జో అచ్యుతానంద’ చిత్రాలు చక్కని విజయం సాధించాయి. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని బజ్‌ బావుంది. విజయ వంతమైన చిత్రాల నాయక, నాయికలు, దర్శకుడు కాంబినేషన్‌లో ఈ చిత్రం తీయడం ఆనందంగా ఉంది’ అని నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్‌, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్‌ కూచిభోట్ల తెలిపారు. (Phalana Abbayi Phana Ammayi shoot in london)



Updated Date - 2022-07-03T01:01:00+05:30 IST