ప్రెటీ బ్యూటీకి... PETA పురస్కారం...

ABN , First Publish Date - 2021-12-28T23:50:53+05:30 IST

2021 సంవత్సరానికిగానూ ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ ఆలియా భట్‌ని తమ ‘పర్సన్ ఆప్ ద ఇయర్‌’గా ప్రకటించింది పెటా సంస్థ. ఆమెకు ఈ గౌరవం దక్కటానికి ప్రధాన కారణం ‘ఫూల్’ అనే కంపెనీలో ఆలియా పెట్టుబడులు పెట్టటమే. ‘ఫూల్’ సంస్థ ‘ఫ్లెదర్’ తయారు చేస్తామని చెబుతోంది. ‘ఫ్లెదర్’ అంటే దేవాలయాల్లో సేకరించిన నిర్మాల్యం తాలూకూ పువ్వులతో...

ప్రెటీ బ్యూటీకి... PETA పురస్కారం...

2021 సంవత్సరానికిగానూ ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ ఆలియా భట్‌ని తమ ‘పర్సన్ ఆప్ ద ఇయర్‌’గా ప్రకటించింది పెటా సంస్థ. ఆమెకు ఈ గౌరవం దక్కటానికి ప్రధాన కారణం ‘ఫూల్’ అనే కంపెనీలో ఆలియా పెట్టుబడులు పెట్టటమే. ‘ఫూల్’ సంస్థ ‘ఫ్లెదర్’ తయారు చేస్తామని చెబుతోంది. ‘ఫ్లెదర్’ అంటే దేవాలయాల్లో సేకరించిన నిర్మాల్యం తాలూకూ పువ్వులతో రూపొందించిన లెదర్! అంటే, భగవంతుడికి అర్పించిన పూలని తరువాత వృథాగా పారవేయకుండా కర్మాగారంలో శాస్త్రీయ పద్ధతుల్లో ‘చర్మం’గా మారుస్తారు. ఈ అహింసయుతమైన ‘వెజిటేరియన్ లెదర్’ వివిధ రకాల వస్తువుల ఉత్పత్తికి వాడతారు. ‘ఫూల్’ కంపెనీ ‘ఫ్లవర్ లెదర్’ లేదా ‘ఫ్లెదర్’ వల్ల ఎన్నో మూగ జీవాల ప్రాణాలు కాపాడబడతాయని పెటా అంటోంది.


పెటా వారి పర్సన్ ఆప్ ద ఇయర్‌గా నిలిచిన ఆలియా భట్ ఇదే యేడు పెటా ఇండియా ఫ్యాషన్ అవార్డ్ కూడా గెలుచుకుంది. ఆమె ‘వెగన్ కిడ్స్‌వెర్ లైన్’‌లో అంతర్భాగంగా జంతువులకి, ప్రకృతికి నష్టం కలిగించకుండా చిన్న పిల్లల బట్టలు అవుతుండటంతో పెటా ఇండియా ఫ్యాషన్ అవార్డ్‌తో సత్కరించారు. మొత్తానికి ‘గంగూభాయ్’ ఆఫ్ బాలీవుడ్ జంతువుల పట్ల తన ఘనమైన ప్రేమని గొప్పగానే చాటుకుంటోందని చెప్పక తప్పదు...                 

Updated Date - 2021-12-28T23:50:53+05:30 IST