వర్మకు పేర్ని నాని నుండి పిలుపు.. ఇదేదో స్కెచ్‌లా ఉందే!

ABN , First Publish Date - 2022-01-08T03:47:40+05:30 IST

కొన్ని రోజులుగా దర్శకుడు వర్మ, ఏపీ మంత్రి పేర్ని నానిల మధ్య ఎటువంటి ట్విట్టర్ వార్ జరుగుతుందో తెలిసిందే. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై వర్మ సంధించే ప్రశ్నలకు పేర్ని నాని కూడా ట్విట్టర్ వేదికగా సమాధానమిస్తూ వస్తున్నారు. అయినా వర్మ

వర్మకు పేర్ని నాని నుండి పిలుపు.. ఇదేదో స్కెచ్‌లా ఉందే!

కొన్ని రోజులుగా దర్శకుడు వర్మ, ఏపీ మంత్రి పేర్ని నానిల మధ్య ఎటువంటి ట్విట్టర్ వార్ జరుగుతుందో తెలిసిందే. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై వర్మ సంధించే ప్రశ్నలకు పేర్ని నాని కూడా ట్విట్టర్ వేదికగా సమాధానమిస్తూ వస్తున్నారు. అయినా వర్మ వెనక్కి తగ్గలేదు. దీంతో ఇలా ట్విట్టర్‌లో వర్మతో వాధించడం కష్టమని అనుకున్నారో.. లేదంటే నిజంగానే ఈ సమస్యపై కూలంకషంగా చర్చించాలని అనుకున్నారో తెలియదు కానీ.. ఏపీ మంత్రి పేర్ని నాని, వర్మతో భేటీకి పిలుపునిచ్చారు. ఈ విషయం స్వయంగా రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. 


‘‘ఏపీ టికెట్ ధరలపై సామరస్యంగా చర్చించేందుకు జనవరి 10వ తేదీ మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయానికి సినిమాటోగ్రఫీ మంత్రిగారు ఆహ్వానించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పేర్ని నానిగారు ధన్యవాదాలు..’’ అని వర్మ ట్వీట్ చేశారు. అయితే వర్మకి ఈ ఆహ్వానం రావడం పట్ల పలు అనుమానాలను నెటిజన్లు వ్యక్తపరుస్తున్నారు. ఇదేదో పెద్ద స్కెచ్‌లా ఉందనేలా వారు కామెంట్స్ చేస్తున్నారు. 


ఎందుకంటే.. ఏపీలో టికెట్ల ధరల సమస్యకానీ, అధిక షోల సమస్యకానీ ఇప్పటిది కాదు. ‘వకీల్‌సాబ్’ సినిమా విడుదలైనప్పటి నుండి రచ్చ జరుగుతూనే ఉంది. అప్పుడు మాట్లాడని వర్మ ఈ మధ్య వరుసగా ట్వీట్స్ యుద్ధం చేయడం, మీడియా ముందుకు రావడం.. వెంటనే ఇలా ఆహ్వానం రావడం చూస్తుంటే ఇదేదో ఏపీ ప్రభుత్వం కావాలనే చేస్తున్నట్లుగా అనిపిస్తుందని అంతా భావిస్తున్నారు. అంతేకాక, ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ఈ మధ్య ఈ సమస్యపై మాట్లాడారు.. వారెవరికీ రాని ఆహ్వానం వర్మకే ఎందుకు వచ్చినట్లు? అంటూ వర్మ ట్వీట్‌కి కామెంట్స్ పడుతున్నాయ్.



Updated Date - 2022-01-08T03:47:40+05:30 IST