థియేటర్ల తనిఖీ అందుకోసమే: పేర్ని నాని

ABN , First Publish Date - 2021-12-31T02:04:06+05:30 IST

ఏపీలో థియేటర్లను ఎందుకు తనిఖీ చేస్తున్నారు అనే దానిపై గురువారం మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘థియేటర్లను తనిఖీ చేసే అధికారం, సీజ్ చేసే అధికారం జిల్లా జాయింట్ కలెక్టర్లకు ఉంటుంది. సరైన అనుమతులు లేకుండా

థియేటర్ల తనిఖీ అందుకోసమే: పేర్ని నాని

ఏపీలో థియేటర్లను ఎందుకు తనిఖీ చేస్తున్నారు అనే దానిపై గురువారం మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘థియేటర్లను తనిఖీ చేసే అధికారం, సీజ్ చేసే అధికారం జిల్లా జాయింట్ కలెక్టర్లకు ఉంటుంది. సరైన అనుమతులు లేకుండా చాలా థియేటర్లను నడుపుతున్నారు. ఇది చట్టపరంగా నేరం అవుతుంది. కాబట్టి.. సెప్టెంబర్‌లోనే నేను అందరికీ చెప్పాను. డిసెంబర్ వచ్చినా.. వారి నుంచి స్పందన రాకపోవడం వల్లే అధికారులు తనిఖీలు చేపట్టారు.


రోజూ వందల మంది థియేటర్లకు వస్తుంటే.. ప్రమాదం జరిగితే ఎలా? అందుకే జాయింట్ కలెక్టర్ దగ్గరకు వెళ్లి దరఖాస్తు చేయమని చెప్పాం. అన్ని రకాల అనుమతులు తీసుకోకుంటే.. చర్యలు తప్పవు. చట్టపరంగా వెళ్లకుండా.. థియేటర్లను నడపడం ధర్మమా?. రేపు ఏదైనా జరగరానిది జరిగితే.. అందరూ ప్రభుత్వాన్నే నిందిస్తారు. అందుకే థియేటర్లకు సంబంధించి అన్ని అనుమతులు ఉండాలని తనిఖీ చేయించాం..’’ అని తెలిపారు. 

Updated Date - 2021-12-31T02:04:06+05:30 IST