Payal Rajput: పచ్చళ్ల స్వాతి పాయల్‌!

ABN , First Publish Date - 2022-08-08T21:00:42+05:30 IST

ఇందు (RX 100), వెన్నెల (Venkimama), హెలెన్‌ (Disco raja).. ఇలా విభిన్న పాత్రలతో మెప్పించిన పాయల్‌ రాజ్‌పుత్‌ ఇప్పుడు పచ్చళ్ల స్వాతిగా కనిపించనున్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘జిన్నా’(Ginna) చిత్రంలో పాయల్‌ (Payal rajput)కథానాయికగా నటిస్తున్నారు.

Payal Rajput: పచ్చళ్ల స్వాతి పాయల్‌!

ఇందు (RX 100), వెన్నెల (Venkimama), హెలెన్‌ (Disco raja).. ఇలా విభిన్న పాత్రలతో మెప్పించిన పాయల్‌ రాజ్‌పుత్‌ ఇప్పుడు పచ్చళ్ల స్వాతిగా కనిపించనున్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘జిన్నా’(Ginna) చిత్రంలో పాయల్‌ (Payal rajput)కథానాయికగా నటిస్తున్నారు. ఇషాన్‌ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విష్ణు గాలి నాగేశ్వరరావుగా, పాయల్‌ పచ్చళ్ల స్వాతిగా కనిపించనున్నారు. సోమవారం పాయల్‌ లుక్‌ను విడుదల చేశారు. లంగా వోణి ధరించి ట్రెడిషనల్‌ లుక్‌లో అలరిస్తుంది పాయల్‌. ఈ పోస్టర్‌ను పాయల్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘‘ప్రతి ఒక్కరి జీవితంలో ఒంటరిగా చెడ్డ పనులు చేయకుండా చూసే ఓ వ్యక్తి కావాలి. పచ్చళ్ల స్వాతి ‘జిన్నా’కు క్రైమ్‌ పార్టనర్‌’’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ తిరుపతిలో జరుగుతుంది. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. కీలక పాత్రలో సన్నీలియోన్‌ నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరకర్త. 




Updated Date - 2022-08-08T21:00:42+05:30 IST