Pawan tej konidela: యాంకర్‌తో కొణిదెల హీరో పెళ్లి!

Twitter IconWatsapp IconFacebook Icon
Pawan tej konidela: యాంకర్‌తో కొణిదెల హీరో పెళ్లి!

కొణిదెల కుటుంబం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవన్‌ తేజ్‌ (Pawan tej konidela)ఓ ఇంటి వాడవుతున్నాడు. నటి, టీవీ యాంకర్‌ మేఘనతో (meghana)ఆయన ఏడడుగులు వేయబోతున్నారు. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’తో పవన్‌ తేజ్‌ హీరోగా పరిచయమయ్యారు. ఆ చిత్రంలో బుల్లితెర యాంకర్‌ మేఘన కథానాయిక. చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఇటీవల వీరిద్దరికి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిశ్చితార్థం అయింది. ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖ (Surekha) దర్శకుడు మెహర్‌ రమేశ్‌(mehar ramesh), సుమ – రాజీవ్‌ కనకాల తదితరులు హాజరయ్యారురు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘మేఘనతో ‘నిశ్చితార్థం జరిగింది. ప్రేమతో మా ప్రయాణం మొదలైంది. మేఘర వల్లే ప్రేమకు సరైన అర్థం తెలిసింది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సురేఖ చిన్నమ్మకు ధన్యవాదాలు. చిరంజీవి బాబాయ్‌.. చిన్నప్పటి నుంచీ ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు’’ అని పవన్‌ తేజ్‌ రాసుకొచ్చారు.





AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.