మీ వరకూ వస్తే ఎవరూ ఉండరు.. అన్యాయంపై ప్రశ్నించండి: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2022-02-25T02:40:48+05:30 IST

‘‘నాకేం అన్యాయం జరగలేదు, జరుగుతోంది పక్కనవాడికి కదా!.. అని ఇప్పుడు మాట్లాడకపోతే, రేపు నీ దాక వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? అందుకే ఇప్పుడే మాట్లాడు, అన్యాయాన్ని ప్రశ్నించు..’’ అనేలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా

మీ వరకూ వస్తే ఎవరూ ఉండరు.. అన్యాయంపై ప్రశ్నించండి: పవన్ కల్యాణ్

‘‘నాకేం అన్యాయం జరగలేదు, జరుగుతోంది పక్కనవాడికి కదా!.. అని ఇప్పుడు మాట్లాడకపోతే, రేపు నీ దాక వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? అందుకే ఇప్పుడే మాట్లాడు, అన్యాయాన్ని ప్రశ్నించు..’’ అనేలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఏపీలో పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రంపై అక్కడి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో తెలియంది కాదు. టీ ధర కంటే తక్కువ ధరకు సినిమా టికెట్లను అమ్మాలి అనేలా ఇచ్చిన జీవోని ‘భీమ్లా నాయక్’ చిత్రానికి పాటించాలని ఏపీ ప్రభుత్వం థియేటర్లకు హెచ్చరికలను జారీ చేసింది. దీనిపై ఇండస్ట్రీ పెద్దలం అని చెప్పుకునే వారేవరు మాట్లాడకుండా గమ్మునుండి పోయారు. రద్దయిన జీవో ప్రకారం టికెట్‌ ధరలను ఎలా నిర్ణయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే కరువయ్యారు. దీనిని దృష్టిలో పెట్టుకునే పవన్ కల్యాణ్.. ఇది నాదు కాదులే అనుకుంటే.. తర్వాత నీ వరకూ వచ్చినప్పుడు ఎవరూ ఉండరు? అనే అర్థం వచ్చేలా ‘పాస్టర్ మార్టిన్ నీమోల్లర్’ కోట్‌ని ట్వీట్ చేశారు.


నాజీ జర్మనీ పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పాస్టర్ మార్టిన్ నీమోల్లర్ నుండి వచ్చిన ఈ సూక్తి.. నా ఆల్ టైమ్ ఫేవరెట్లలో ఒకటి. ఎంతటి సత్యమిది!

‘‘మొదట వారు సోషలిస్టుల కోసం వచ్చారు..

నేను మాట్లాడలేదు.. ఎందుకంటే నేను సామాజికవాదిని కాదు

అప్పుడు వారు ట్రేడ్ యూనియన్ వాదుల కోసం వచ్చారు..

నేను మాట్లాడలేదు.. ఎందుకంటే నేను ట్రేడ్ యూనియన్ వాదిని కాదు

అప్పుడు వారు యూదుల కోసం వచ్చారు, నేను మాట్లాడలేదు

ఎందుకంటే నేను యూదుడిని కాదు

అప్పుడు వారు నా కోసం వచ్చారు.. నా కోసం మాట్లాడటానికి ఎవరూ లేరు’’.. అని పాస్టర్ మార్టిన్ నీమోల్లర్ రాసిన కవితను పవన్ కల్యాణ్ ఉదహరించారు.


అసలీ ఫ్రెడరిక్ గుస్తావ్ ఎమిల్ మార్టిన్ నీమెల్లర్ ఎవరు?

ఫ్రెడరిక్ గుస్తావ్ ఎమిల్ మార్టిన్ నీమోల్లర్ జనవరి 14, 1892 న జర్మన్ నగరమైన లిప్‌స్టాడ్‌లో జన్మించారు. ప్రొటెస్టాంటిజం యొక్క మతపరమైన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్న ఒక ప్రముఖ జర్మన్ పాస్టర్. అదనంగా, అతను రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిస్ట్ వ్యతిరేక ఆలోచనలను చురుకుగా ప్రచారం చేయడమే కాకుండా ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో శాంతి కోసం వాదించారు. నావికాదళ అధికారిగా కూడా ఆయన బాధ్యతలను నిర్వహించారు.

Updated Date - 2022-02-25T02:40:48+05:30 IST