Pawan Kalyan : ది ట్రెండ్ సెట్టర్ !

ABN , First Publish Date - 2022-09-02T14:28:41+05:30 IST

కోట్లాది అభిమానుల గుండెల్లో ఎన్నటికీ చెరగని చిరునామా ఆ పేరు. చాలా మంది సిల్వర్ స్ర్కీన్ పై మాత్రమే హీరోలు. కానీ ఆయన రియల్ లైఫ్ లోనూ తనదైన సిద్ధాంతాల్ని నమ్మి ఫాలో అవుతారు. అందుకే ఆయనకు ఫ్యాన్స్ కన్నా భక్తులెక్కువ.

Pawan Kalyan : ది ట్రెండ్ సెట్టర్ !

సిల్వర్ స్ర్కీన్ సెన్సేషన్ 

బాక్సాఫీస్ సెలబ్రేషన్ 

సక్సెస్‌తో కొలవలేని క్రేజ్

రేటింగ్‌తో అంచనా వేయలేని రేంజ్ 

నమ్మిన సిద్ధాంతాలతో 

నమ్ముకొన్న వారికోసం 

ఎంతదూరమైనా వెళ్ళగలిగే నిత్య సత్యాగ్రహి

జనహితాన్ని కోరే ప్రభంజన సేనాని 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). 

కోట్లాది అభిమానుల గుండెల్లో ఎన్నటికీ చెరగని చిరునామా ఆ పేరు. చాలా మంది సిల్వర్ స్ర్కీన్ పై మాత్రమే హీరోలు. కానీ ఆయన రియల్ లైఫ్ లోనూ తనదైన సిద్ధాంతాల్ని నమ్మి ఫాలో అవుతారు. అందుకే ఆయనకు ఫ్యాన్స్ కన్నా భక్తులెక్కువ. నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో ఆయన సెట్ చేసిన ట్రెండ్ పై .. కొన్ని విశేషాల్ని చూద్దాం...


‘నేను ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తాను’... అంటారు ‘గబ్బర్‌సింగ్’ (Gabbar Singh) సినిమాలో పవన్ కళ్యాణ్. నిజమే. ఆయనెప్పుడూ అంతకు ముందున్న ట్రెండ్ ను ఫాలో అవరు. అభిమానులు వెర్రెత్తిపోయే రేంజ్ ట్రెండ్‌ను సెట్ చేస్తారు. కొత్త సినిమాలో సరికొత్త ఫ్యాంట్స్ వేస్తే చాలు యూత్ అంతా వాటికోసం క్యూలు కడతారు. మెడపై చెయ్యిపెట్టి రుద్దుకుంటూ.. అగ్రెసివ్ గా ఒక లుక్ ఇస్తే చాలు.. థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. ఏ పాత్ర చేసినా.. దానికి తనదైన స్టైల్లో ఓ టచ్ ఇస్తే చాలు.. ఫ్యాన్స్‌లో పూనకాలు ఆటోమేటిగ్గా వచ్చేస్తాయి. లవ్ స్టోరీస్ తో, ఫ్యామిలీ స్టోరీస్ తో ఇండస్ట్రీ హిట్స్ కొడితే.. మిగతా హీరోలు కూడా ఆ ఫార్ములానే ఫాలో అయిపోతారు. అంతలా పవన్ ప్రభావం ఆడియన్స్, ఇండస్ట్రీపై ఉంటుంది. ఎప్పుడు కొత్త సినిమా విడుదలవుతున్నా.. థియేటర్ల దగ్గర మాస్ జాతర. ఫ్యాన్స్ ప్రభంజనం. పండగ వాతావరణం. 


ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోను కొన్నాళ్లు పక్కన పెడతారు దర్శక నిర్మాతలు. ఇప్పటి పరిస్థితి ఇది. దాని వల్ల అతడి మార్కెట్ కూడా డౌన్ ఫాల్లోకి వచ్చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ దీనికి అతీతుడు. ఒక దశలో ఫ్లాపుల పరంపరతో అభిమానుల్ని నిరాశపరిచారు పవన్ కళ్యాణ్. ఆ వెంటనే ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టి అంతకు ముందు ఎదురైన పరాజయాలకు గట్టి సమాధానం చెప్పారు. అందుకే పవర్ స్టార్ క్రేజ్.. జయాపజయాలతో సంబంధం లేనిది. అంతగా తన ఫ్యాన్ బేస్ ను పెంచుకోడానికి, దర్శక నిర్మాతలపై నమ్మకాన్ని కలిగించడానికి ఒకే ఒక కారణం పవర్ స్టార్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్. దాని వల్లనే ఆయన సెట్ చేసిందే ట్రెండ్ అయింది. ఆయన ఫిక్స్ చేసిందే బ్రాండ్ అయింది. 


సక్సెస్ ఉన్న దర్శకులతో ఏ హీరో అయినా సినిమాలు చేస్తాడు. కానీ కొత్త దర్శకుడి టాలెంట్‌ను నమ్మి.. అతడికి అవకాశమివ్వడం, ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆ దర్శకుడు సెన్సేషనల్ హిట్ అందుకోవడం ఒక్క పవన్ విషయంలోనే జరిగింది. కరుణాకరన్ (Karunakaran) అనే దర్శకుడికి పవన్ అవకాశమివ్వకపోతే ‘తొలిప్రేమ’ (Tholi Prema) లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ వచ్చి ఉండేది కాదు. పూరీ జగన్నాథ్ (Puri Jagannath) అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయకపోతే..  ‘బద్రి’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ వచ్చి ఉండేది కాదు. తమిళ దర్శకుడు కదా.. తెలుగు నేటివిటీతో ఏం సినిమా తీయగలడు అని పవన్ యస్.జే సూర్య (SJ Surya) ని  లైట్ తీసుకొని ఉంటే.. ‘ఖుషి’ లాంటి ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ  వచ్చి ఉండేది కాదు. నేను హీరోను మాత్రమే.. దర్శకత్వంలో వేళ్ళు పెట్టడం ఎందుకని పవన్ ఆలోచించి ఉంటే..  ‘జానీ’ తో ఆయన దర్శకుడు అయి ఉండేవాడు కాదు. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే అందులోని పవర్‌ఫుల్ ఫైట్స్‌ను ఆస్వాదించకుండా ఉండలేరు అభిమానులు. 


ఎప్పుడో పద్నాలుగేళ్ళ క్రితం థియేటర్స్‌లో రికార్డు వసూళ్ళతో దుమ్ము రేపిన ఓ సినిమా.. ఇప్పడు మళ్ళీ విడుదలైతే.. అదేదో ఆయన లేటెస్ట్ మూవీ అయినట్టు అభిమానులు ఎగబడి మరీ ‘జల్సా’ (Jalsa) చేసుకున్నారు. ఆ సినిమాతో ఆయన అప్పట్లో ఓ  ట్రెండ్ సెట్ చేస్తే .. ఇప్పుడు కూడా ఆ సినిమాని ఫ్యాన్స్ ఉప్పెనలా ముంచెత్తడం పవన్ క్రియేట్ చేసిన మరో ట్రెండ్ అని కచ్చితంగా చెప్పుకు తీరాలి. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ రికార్డులు, కలెక్షన్లు, కాంప్లిమెంట్లూ అన్నీ ఇన్నీకావు. ఒక వైపు పాలిటిక్స్ లో బిజీగా ఉంటూ.. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ మరోవైపు ఫ్యాన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూ.. పవర్ స్టార్‌గా  తన స్థానంలో తాను కంటిన్యూ అవుతున్నారు పవన్. అందుకే ఆయన ట్రెండ్ సెట్టర్. దటీజ్ పవన్ కళ్యాణ్. 

Updated Date - 2022-09-02T14:28:41+05:30 IST