Pawan Kalyan అవి పూర్తి చేస్తేనే.. కాపాడినట్లు.. లేదంటే?

ABN , First Publish Date - 2022-05-14T03:29:56+05:30 IST

సాధారణంగా సినిమా షూటింగ్ అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అలాంటిది స్టార్ హీరోల సినిమాల షూటింగ్ అంటే ఇంకా ఎంత ఖర్చు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీగా జూనియర్ ఆర్టిస్టులు

Pawan Kalyan అవి పూర్తి చేస్తేనే.. కాపాడినట్లు.. లేదంటే?

సాధారణంగా సినిమా షూటింగ్ అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అలాంటిది స్టార్ హీరోల సినిమాల షూటింగ్ అంటే ఇంకా ఎంత ఖర్చు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీగా జూనియర్ ఆర్టిస్టులు, వందల్లో టెక్నీషియన్లు ఇలా చెప్పుకుంటూ పోతే సెట్లో చాలా మంది పని చేస్తూ ఉంటారు. అందుకే ఒక్క రోజు షూటింగ్ ఆగిపోయినా కూడా నిర్మాతలకు కోట్లలో నష్టం వస్తుంది. మాములు హీరోలకే ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) సినిమాకి ఇంకెలా ఉండాలి. కేవలం కొన్ని రోజులే షూటింగ్ జరుపుకున్న ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమాకే పవన్ దాదాపు యాబై కోట్లకి పైగా రెమ్యునరేషన్ అందుకున్నారనే టాక్ ఉంది. 


సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి ప్రతి రోజూ, షూటింగ్ కోసం ఇంచు మించు 10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందట. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు (Harihara Veeramallu) షూటింగ్‌ మొన్నటి వరకు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. షూటింగ్‌ ప్రారంభం అయ్యి ఏడాదిన్నర అవుతున్నా.. ఇంకా పూర్తి కాకపోవడం పట్ల అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఎట్టకేలకు సినిమాను ముగించేందుకు క్రిష్ (Krish) కంకణం కట్టుకున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్‌‪ను కూడా రీస్టార్ట్ చేసారు. ఇక శరవేగంగా షూటింగ్ జరగడమే ఆలస్యం అనుకుంటున్న టైంలో... పవన్ మరో రీమేక్‪కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ (Harish Shankar) మూవీ అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది కానీ.. అది ఇంకా పట్టాలు ఎక్కలేదు. ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ (Bhavadeeyudu Bhagat Singh) ఈ రెండు మూవీస్‪ని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా.. షూటింగ్స్ మాత్రం డిలే అవుతూనే ఉన్నాయి. ఈ రెండింటి మధ్య‪లో అనౌన్స్ అయిన ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కూడా అయింది.


మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో (Politics) కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ కారణంగానే ఒప్పుకున్న సినిమాలు డిలే అవుతూ ఉన్నాయి. రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో పవన్ ఇబ్బంది పడుతున్నాడో.. లేక పవన్ పొలిటికల్ జర్నీకి తగ్గట్లు తమ సినిమాల షూటింగ్‪లని ప్లాన్ చేసుకోవడంలో డైరెక్టర్స్ (Directors) ఇబ్బంది పడుతున్నారో తెలియదు కానీ... దసరాకి రావాల్సినవి సంక్రాంతికి, సంక్రాంతికి రావాల్సినవి సమ్మర్‪కి వస్తున్నాయి. ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ వరుసగా పర్యటనలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇదే జరిగితే ‘హరిహర వీర మల్లు, భవధీయుడు భగత్‪సింగ్’ సినిమాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 


పవన్ పొలిటికల్‪గా బిజీ అయ్యే లోపు, ఇప్పటికే ఒప్పుకున్న ఈ రెండు సినిమాలని కంప్లీట్ చేసి, ఆ తర్వాత టైం ఉంటే కొత్త సినిమాలని ఒప్పుకోవడం బెటర్. లేదంటే, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) ‘ఆచార్య’ (Acharya) ప్రొమోషనల్ ఈవెంట్‪లో చెప్పినట్లు... సినిమా డిలే అయినందుకు నిర్మాతలు కోట్ల వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ‘ఆచార్య’ అంటే చిరు సొంత సినిమా కాబట్టి వడ్డీ కట్టాల్సి వచ్చినా తట్టుకోని నిలబడగలిగారు. పవన్ సినిమాల పరిస్థితి అది కాదు, అతని నిర్మాతలు కుటుంబ సభ్యులు కూడా కాదు. సో కమిట్ అయిన ప్రకారం పవన్ ఇన్ టైంలో సినిమాలు కంప్లీట్ చేస్తే, ప్రొడ్యూసర్‪ని రిస్క్‪లో పడకుండా కాపాడిన వాడవుతారు. లేదంటే.. ఆయనతో చేసిన నిర్మాతలకు అప్పులకు వడ్డీ కట్టడం తప్ప మిగిలేది ఏమీ ఉండదు.

Updated Date - 2022-05-14T03:29:56+05:30 IST