Pawan Kalyan: అమూల్యమైన మీ వాత్సల్యానికి మన:పూర్వక కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2022-09-03T02:52:52+05:30 IST

నాపై అమూల్యమైన వాత్స్యల్యాన్ని కనబరుస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: అమూల్యమైన మీ వాత్సల్యానికి మన:పూర్వక కృతజ్ఞతలు

నాపై అమూల్యమైన వాత్స్యల్యాన్ని కనబరుస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan). ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో..


‘‘పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటూ.. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ ఉంటాను. ఈ యేడాది కూడా అదే విధంగా జన్మదినం సందర్భంగా ఆధ్యాత్మిక సంబంధ కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకోవడం నా బాధ్యతగా భావిస్తాను. 


నాపై ఉన్న వాత్సల్యంతో, అభిమానంతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ మన:పూర్వక కృతజ్ఞతలు. శ్రేయోభిలాషులైన పెద్దలు, రాజ్యంగబద్ద పదవుల్లో ఉన్నవారు శుభాశీస్సులు అందచేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, సినీ తారలు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు, పాత్రికేయులు, ప్రవాస భారతీయులు శుభాకాంక్షలు తెలిపారు. నన్ను తమ కుటుంబంలో ఒకడిగా చూసుకొంటున్న అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తమదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లడించారు. నాపై అమూల్యమైన వాత్స్యల్యాన్ని కనబరుస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్త దాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి నా జన్మదిన కార్యక్రమానికి ఒక ప్రయోజనం కలిగించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు.. 

ఇట్లు

పవన్ కళ్యాణ్’’.. అని తెలిపారు.



Updated Date - 2022-09-03T02:52:52+05:30 IST