Pawan Kalyan: ప్లాన్ మార్చిన పవన్..భవదీయుడు ఇంకాస్త ఆలస్యం..?

Twitter IconWatsapp IconFacebook Icon

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్లాన్ మార్చారా..? హరీష్ శంకర్ (Harish Sankar) దర్శకత్వంలో చేయాల్సిన 'భవదీయుడు భగత్‌సింగ్' (BhavadeeyuDu Bhagathsingh) ఇంకాస్త ఆలస్యంగా సెట్స్‌పైకి వస్తుందా..! అంటే తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే అదే అనిపిస్తోంది. 'వకీల్ సాబ్' (Vakeel Saab), 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న పవన్, ప్రస్తుతం క్రిష్ (Krish) దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. 

వాస్తవంగా 'భీమ్లా నాయక్' కమిటవకపోతే, ఈ పాటికే వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. దాదాపు 15 నెలలు షూటింగ్ దశలో నిలిచిపోయిన వీరమల్లు సినిమా మళ్ళీ తిరిగి ఈ నెల మొదటి వారం నుంచి సెట్స్‌పైకి వచ్చి నాన్ స్టాప్‌గా చిత్రీకరణ సాగుతోంది. అయితే, 'భవదీయుడు భగత్‌సింగ్' సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు, వీరమల్లు సినిమాకు సంబంధించి పవన్ కళ్యాన్ సీన్స్ మొత్తం షూటింగ్ అయితే, హరీష్ శంకర్‌తో సెట్స్‌పైకి వచ్చేస్తారని వార్తలు వచ్చాయి.

కానీ, తాజాగా సమాచారం మేరకు భవదీయుడు సెట్స్‌పైకి ఇప్పుడే రాదని అంటున్నారు. దీనికంటే ముందుకు తమిళ హిట్ సినిమా 'వినోదాయ సితం' (Vinodaya Sitam) తెలుగు రీమేక్ చిత్రాన్ని చేయాలని పవన్ నిర్ణయించుకున్నారట. త్రివిక్రం శ్రీనివాస్ (Trivikram Srinivas) స్క్రిప్ట్ సిద్ధం చేస్తుండగా, ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన నటుడు, దర్శకుడు సముద్రఖని తెలుగు రీమేక్‌ను తెరకెక్కించనున్నారట. పవన్‌తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Teaj కూడా ఈ మూవీలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. ఇదే నిజమైతే భవదీయుడు భగత్‌సింగ్ ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకువస్తుందనుకోవచ్చు.  

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.