పవన్ కల్యాణ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారిప్పుడు. ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ దశలో ఉంది. హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ స్ర్కిప్టుతో రెడీగా ఉన్నారు. ఇవి కాక పవన్ కోసం... రెండు మూడు కథలు సిద్ధం అవుతున్నాయి. ఈలోగా... మరో రీమేక్ పట్టాలెక్కడానికి ఎదురుచూస్తోంది. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వినోదయసీతమ్’ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కథానాయకుడు. ఓ కీలక పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేయాలన్నది ఽధ్యేయం. 2023 ప్రధమార్థంలో విడుదల చేస్తారు. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. స్ర్కిప్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైందని సమాచారం. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.