Pawan Kalyan: చిరు అనుకుంటే.. సీన్‌లోకి పవన్ వచ్చాడు

ABN , First Publish Date - 2022-09-09T02:33:47+05:30 IST

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. మాములుగా అయితే ఈ ట్రైలర్ విడుదలైంది అని సింపుల్‌గా చెప్పేయవచ్చు. కానీ ఈ సినిమా ట్రైలర్ విడుదలకో విశిష్టత ఉంది. ఈ ట్రైలర్‌ని..

Pawan Kalyan: చిరు అనుకుంటే.. సీన్‌లోకి పవన్ వచ్చాడు

‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ (Nenu Meeku Baaga Kavalsinavaadini).. ఈ టైటిల్‌తో సంచలన దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి (Kodi Divya Deepthi) ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ఈ చిత్రానికి శ్రీధర్ గాదే (Sridhar Gade) దర్శకుడు. సెప్టెంబర్ 16న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. మాములుగా అయితే ఈ ట్రైలర్ విడుదలైంది అని సింపుల్‌గా చెప్పేయవచ్చు. కానీ ఈ సినిమా ట్రైలర్ విడుదలకో విశిష్టత ఉంది. ఈ ట్రైలర్‌ని ఎవరు విడుదల చేశారో తెలుసా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (PowerStar Pawan Kalyan). ట్రైలర్ విడుదలకు ముందు.. మేకర్స్ తమ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతుంది పవన్ కల్యాణ్ అని చెప్పలేదు. కానీ ‘మా అందరికీ.. మీ అందరికీ కావాల్సిన వాడు’ ఈ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారంటూ.. చిత్ర నిర్మాత కోడి దివ్య దీప్తి ఓ వీడియోలో చిత్రయూనిట్‌కు తెలిపింది. ఎవరనేది మాత్రం చెప్పలేదు. 


అందరికీ కావాల్సినవాడని అంటున్నారు.. ఎవరై ఉంటారా? అని నెటిజన్లు కూడా సెర్చింగ్ మొదలెట్టారు. అయితే పవన్ కల్యాణ్ అని మాత్రం అస్సలు ఊహించలేదు.. అందరూ ‘అందరివాడు’గా భావించే మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) అనుకున్నారు. కానీ, కాసేపట్లో ట్రైలర్ విడుదలనంగా పవన్ కల్యాణ్ పేరును రివీల్ చేశారు. ఇక ట్రైలర్ విడుదల అనంతరం చిత్రయూనిట్‌తో పవర్ స్టార్ సరదాగా ముచ్చటించిన వీడియోని కూడా మేకర్స్ వదిలారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా రూపురేఖలే మారిపోయాయి. విడుదలైన ట్రైలర్ కూడా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. 


ఈ ట్రైలర్‌లో కిరణ్ అబ్బవరం క్యాబ్ డ్రైవర్‌గా మాస్‌ లుక్‌తో కనిపిస్తున్నాడు. నటుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా ఇందులో కీలక పాత్రలలో నటించినట్లుగా తెలుస్తుంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. మంచి అంచనాలు క్రియేట్ చేస్తుంది. కిరణ్ సరసన సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 



Updated Date - 2022-09-09T02:33:47+05:30 IST