మొన్న Ntr.. నిన్న Pawan ఫ్యాన్‌: అభిమానానికి పరాకాష్ట!

ABN , First Publish Date - 2022-08-06T22:25:04+05:30 IST

అగ్ర హీరోల అభిమానం పరాకాష్టకు చేరుతుంది. తమ హీరో సినిమా రిలీజ్‌ అవుతుందంటే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్‌ కోలాహలం మామూలుగా ఉండదు. భారీ కటౌట్లు, నెత్తుటి తిలకం దిద్దడం, పాలాభిషేకాలు చేయడం, గజమాలల అలంకారం ఇలా నానా హంగామా చేస్తుంటారు.

మొన్న Ntr.. నిన్న Pawan ఫ్యాన్‌: అభిమానానికి పరాకాష్ట!

అగ్ర హీరోల అభిమానం పరాకాష్టకు చేరుతుంది (Fans). తమ హీరో సినిమా రిలీజ్‌ అవుతుందంటే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్‌ కోలాహలం మామూలుగా ఉండదు. భారీ కటౌట్లు, నెత్తుటి తిలకం దిద్దడం, పాలాభిషేకాలు చేయడం, గజమాలల అలంకారం ఇలా నానా హంగామా చేస్తుంటారు. అభిమాన హీరో జనాల మధ్యలోకి వచ్చినా ఇదే పరిస్థితి. మితిమీరిన అభిమానం ఫీట్స్‌ చేయిస్తుంది. ఇటీవల తమిళనాడులోని హోసూర్‌ ప్రాంతంలో జరిగిన ఓ ఉత్సవంలో ఎన్టీఆర్‌ అభిమానులు హంగామా చేశారు. అక్కడ సంప్రదాయం ప్రకారం ఆ ఉత్సవంలో  రెండు హుక్‌లను మనిషి వీపు భాగానికి గుచ్చి తాడుకి  కట్టి క్రేన్‌ సాయంతో ధ్వజస్తంభం అంత ఎత్తు నుంచి వేలాడదీసి ఆరాధ్యధైవాన్ని కోలుస్తారు. ఇప్పుడు అదే స్టైల్‌ను ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోల కోసం చేస్తున్నారు. ఆ క్రేన్‌ సాయంతో గాల్లో ఎగురుతూ హీరోలకు జేజేలు కొడుతున్నారు. వారం క్రితం హోసూర్‌లో ఎన్టీఆర్‌ (NTr)ఫ్యాన్స్‌ ఇలా చేశారు. రెండ్రోజులు క్రితం పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan fans) ఫ్యాన్‌ కూడా ఇలాగే చేశారు. గాల్లో వేలాడుతూ పవన్‌కల్యాణ్‌ పోస్టర్‌ను కిందకి వేలాడదీశారు. పుష్ప వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇలాంటి ప్రమాదకర పనులు చేయవద్దని ఎంత వారించిన అభిమానులు మాత్రం తగ్గడం లేదు. జాగ్రత్తలు చెబుతున్నప్పటికీ అభిమానం చూపించే క్రమంలో హద్దు మీరి ఫీట్లు చేస్తున్నారు. 




Updated Date - 2022-08-06T22:25:04+05:30 IST