Pawan Fans peaks: పవన్ మాల.. కఠిన దీక్ష

ABN , First Publish Date - 2022-08-20T02:23:41+05:30 IST

అభిమానుల అభిమానం హద్దు దాటుతోంది.. హీరోల పట్ల అభిమానం పీక్స్‌ చేరినట్లు కనిపిస్తోంది. అభిమాన హీరోలకు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, నెత్తుటి తిలకం దిద్దడం, అన్నదానాలు, సేవా కార్యక్రమాలను దాటుకొని పోయింది. (Janasena party) ఇప్పుడు హీరోల పేర దీక్షలు తీసుకోవడం, మాల వేసుకునే ట్రెండ్‌ మొదలైంది. హీరోలను దేవుళ్లను చేసేస్తున్నారు.

Pawan Fans peaks: పవన్ మాల.. కఠిన దీక్ష

అభిమానుల అభిమానం హద్దు దాటుతోంది..

హీరోల పట్ల అభిమానం పీక్స్‌ చేరినట్లు కనిపిస్తోంది. 

అభిమాన హీరోలకు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, నెత్తుటి తిలకం దిద్దడం, అన్నదానాలు, సేవా కార్యక్రమాలను దాటుకొని పోయింది. (Janasena party)

ఇప్పుడు హీరోల పేర దీక్షలు తీసుకోవడం, మాల వేసుకునే ట్రెండ్‌ మొదలైంది. హీరోలను దేవుళ్లను చేసేస్తున్నారు. (Pawan kalyan Fans peaks)

అసలు విషయానికొస్తే... పవన్‌కల్యాణ్‌కి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘ఖుషి’ తర్వాత పదేళ్లు హిట్‌ లేకపోయినా ఫ్యాన్‌ బేస్‌ మాత్రం తగ్గలేదు. హీరోగా పవన్‌ను ఇష్టపడేవాళ్లు కొందరుంటే.. ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడేవారు కోకొల్లలు. చాలామంది అభిమానులు ‘మా దేవుడు’ పవన్‌కల్యాణ్‌ అంటూ హడావిడి చేస్తుంటారు. ఇప్పుడు ఆ అభిమానం పీక్స్‌కు చేరింది. అందుకు ఉదాహరణ.. అభిమానులు కొందరు ‘పవన్‌ మాల’ ధరించడం! 


వేంకటేశ్వరస్వామి మాల, శివ మాల, అయ్యప్ప దీక్ష, హనుమాన్‌ దీక్ష, దసరా సమయంలో అమ్మవారి దీక్ష  తీసుకోవడం తెలుసు కానీ ఈ పవన్‌ మాల ఏంటి అనుకుంటున్నారా? అవును ఫస్ట్‌ టైమ్‌ ఓ సినిమా హీరో, రాజకీయ నాయకుడి కోసం అభిమానులు దీక్ష తీసుకోవడం విచిత్రంగా ఉంది కదూ!  (Pawan maala)

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు, విజయవాడకు చెందిన పవన్‌కల్యాణ్‌ అభిమానులు తమ హీరో, నాయకుడు అయిన పవన్‌ కళ్యాణ్‌ 49వ జన్మదినోత్సవం సందర్భంగా ‘పవన్‌ మాల’ పేరుతో దీక్షను స్వీకరించారు. హిందు, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన డాలర్‌లతో కూడిన మాలలను, ఎర్ర కండువాను ధరించి, శక్తి కొద్దీ 41, 21 రోజులపాటు దీక్ష చేయనున్నారు. మండల కాలంపాటు పవన్‌ కళ్యాణ్‌ కార్యక్రమాలను, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన రాజకీయాల్లో విజయం సాధించేలా ప్రచారం చేస్తామని మాలధారులు ప్రతిజ్ఞ చేశారు. చిత్తశుద్థితో కఠినమైన దీక్షను అనుసరిస్తామని పవన్‌కల్యాణ్‌ చేసే ప్రజా ేసవను స్పూర్తిగా తీసుకుని తాము కూడా సేవలు చేస్తామని ప్రకటించారు. 2019లో కూడా కొందరు అభిమానులు ఇలాగే చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు. (pawan kalyan)




Updated Date - 2022-08-20T02:23:41+05:30 IST