Pawan Kalyan: హరిహర వీరమల్లుకి సమాయత్తం అవుతున్న పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2022-10-01T00:02:18+05:30 IST

అటు రాజకీయ పర్యటనలతో ప్రజలను కలుసుకునే దిశలో బిజీగా వున్నా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు కొంచెం సినిమాల (Cinema) మీద దృష్టి సారించారు.

Pawan Kalyan: హరిహర వీరమల్లుకి సమాయత్తం అవుతున్న పవన్ కళ్యాణ్

అటు రాజకీయ పర్యటనలతో ప్రజలను కలుసుకునే దిశలో బిజీగా వున్నా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు కొంచెం సినిమాల (Cinema) మీద దృష్టి సారించారు. రాజకీయ సభలకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా తనంతట తానుగా ప్రజలతో మమేకం అవుతున్న పవన్ కళ్యాణ్ ఆ సభలకి, సమావేశాలకు కావాల్సిన డబ్బులు రావాలంటే సినిమాలు చెయ్యాలి కదా. 


అందుకే ఇప్పుడు కొన్ని రోజులు సినిమాల మీద దృష్టి పెట్టి, హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) షూటింగ్ (Shooting) చెయ్యాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్టుగా ఆ సినిమాకి ఎక్కువ రోజులు కేటాయించి పెద్ద షెడ్యూల్ వేసుకున్నాడు. 


ఆ సన్నివేశాలు అన్నిటికీ ముందుగా ప్రిపేర్ అవ్వటం కోసం ఒక వర్క్ షాప్ కూడా పెట్టి అందులో రిహార్సల్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది అతని ఏకాగ్రత, పరిపూర్ణతని తెలియచేస్తుంది. పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు క్రిష్ (Director Krish), సంగీత దర్శకుడు కీరవాణి (Music director Keeravani) మిగతా యూనిట్ సభ్యులు పాల్గొన ఈ వర్క్ షాప్ (Workshop) ఇంకో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం వుంది. ఈ సినిమాని తొందరగానే పూర్తి చేసే యోచనలో కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-10-01T00:02:18+05:30 IST