తెలుగు చిత్ర పరిశ్రమ అందరిసొత్తు: Pawan Kalyan

ABN , First Publish Date - 2022-06-10T14:42:41+05:30 IST

‘తెలుగు చిత్ర పరిశ్రమ ఒకరిసొత్తు కాదు.. అందరిసొత్తు’.. అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan). నేచురల్ స్టార్ నాని (Nani), నజ్రియా (Nazriya) జంటగా రూపొందిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’

తెలుగు చిత్ర పరిశ్రమ అందరిసొత్తు: Pawan Kalyan

‘తెలుగు చిత్ర పరిశ్రమ ఒకరిసొత్తు కాదు.. అందరిసొత్తు’.. అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan). నేచురల్ స్టార్ నాని (Nani), నజ్రియా (Nazriya) జంటగా రూపొందిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (జూన్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందు (జూన్ 9) చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ..‘ఇక్కడకు వచ్చిన పెద్దలకు, ఆడపడుచులకు, అక్కచెల్లెలకు ముందుగా నా నమస్కారం. అభిమానులుగా మీ ఉరకలెత్తే మీ ఉత్సాహమే లేకపోతే ఏ ఈ వెంట్‌కుకు అందం ఉండదు. ఈ సభకు విశిష్ట అతిధులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఇక అంటే సుందరానికీ సినిమా ఫంక్షన్‌కు నన్ను ఆహ్వానించినందుకు నిర్మాతలకు నా ధన్యవాదాలు.. అన్నారు హీరో నాని నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం.. బలంగా నిలబడే వ్యక్తి.. ఆయనకు భగవంతుడు గొప్ప విజయాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’..అన్నారు.


అంతేకాకుండా.. ‘తెలుగు చిత్ర పరిశ్రమ.. ఇది ఒకరి సొత్తు కాదు.. అందరి సొత్తు. మీ అందరి అభిమానం.. ప్రజల కోసం పనిచేయగలిగే, నిలబడగలిగే.. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడగలిగే గుండె దైర్యం మీరు ఇచ్చారు. మీ అభిమానం ఇచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చింది. మా అన్నయ కావొచ్చు, నా సోదరుడు నాగబాబు కావచ్చు. మా కుటుంబం నుంచి వచ్చిన నటీనటులది కావొచ్చు.. తెలుగు చిత్రపరిశ్రమ ఒక కుటుంబానిది కాదు..ఇది మన అందరిది’..అని తెలిపారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2022-06-10T14:42:41+05:30 IST