‘భవదీయుడు భగత్ సింగ్’పై Pawan Kalyan క్లారిటీ..

ABN , First Publish Date - 2022-06-10T15:21:02+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కాస్త గ్యాప్ తర్వాత కమిటైన సినిమాలలో ‘భవదీయుడు భగత్ సింగ్’ (Bhavadeeyudu Bhagat Singh) కూడా ఒకటి.

‘భవదీయుడు భగత్ సింగ్’పై Pawan Kalyan క్లారిటీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కాస్త గ్యాప్ తర్వాత కమిటైన సినిమాలలో ‘భవదీయుడు భగత్ సింగ్’ (Bhavadeeyudu Bhagat Singh) కూడా ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం పవన్ చేస్తున్న సినిమాలు ఆలస్యంగా షూటింగ్ జరుపుకుంటుండటమే. ఆయన రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఇటు అభిమానులు, ప్రేక్షకులకోసం సినిమాలు చేస్తూనే అటు ప్రజలకోసం రాజకీయాలపైనా దృష్ఠి పెడుతున్నారు. దానివల్ల అనుకున్న సమయానికి పవన్ సినిమాలు రావడం లేదు. 


ఇప్పటికే, క్రిష్ (Krish) దర్శకత్వంలో పవర్ స్టార్ నటిస్తున్న పీరియాడిక్ సినిమా ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) 15 నెలలు దాకా షూటింగ్ ఆగిపోయింది. మధ్యలో ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమా కమిటవడం ఓ కారణం అయితే, కరోనా వేవ్స్ మరో కారణం. ఇవన్నీ పట్టించుకోకుండా పవన్ సినిమాలకు మళ్ళీ బ్రేక్ ఇస్తున్నారని..ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న సినిమాలు, సెట్స్‌పైకి రావాల్సిన సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో.. అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వీరమల్లు చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువచ్చి సమాధానం చెప్పారు.


ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - హరీష్ శంకర్ (Harish Shankar) - మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) కాంబినేషన్‌లో మొదలవ్వాల్సిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా విషయంలో కూడా ఇలాంటి గాలి వార్తలే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కూడా తాజాగా పవర్ స్టార్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ ..తాను భవదీయుడు సినిమా చేస్తున్నాను అని..ఇది ఆగిపోలేదని తెలిపారు. దాంతో భవదీయుడు సినిమా గురించి ఇన్నాళ్ళు వచ్చింది సృష్ఠించిన గాలి వార్తలే అని తేలిపోయింది. ఇక ఇప్పటికే పవన్ - హరీష్ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో భవదీయుడుపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.  

Updated Date - 2022-06-10T15:21:02+05:30 IST