Ante Sundaraniki: ‘పవర్’ ఫుల్ అప్‌డేట్

ABN , First Publish Date - 2022-06-08T01:32:26+05:30 IST

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్

Ante Sundaraniki: ‘పవర్’ ఫుల్ అప్‌డేట్

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని (Naveen Yerneni), రవిశంకర్ వై (Ravi Shankar Y) నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన సాంగ్స్, టీజర్, తాజాగా విడుదలైన ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పవర్ ఫుల్ అప్‌డేట్‌ను హీరో నాని తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారని, అలాగే ప్రీ రిలీజ్ జూన్ 9వ తేదీన జరుగనుందని నాని తెలిపారు. 


అంతకుముందు ప్రీ రిలీజ్ వేడుక జూన్ 8 అని మేకర్స్ తెలపడమే కాకుండా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మొదలు పెట్టారు. తాజాగా నాని ప్రీ రిలీజ్ వేడుక 9 అని ప్రకటించడమే కాకుండా.. పవర్ స్టార్ ఈ వేడుకకు వస్తున్నారని చెప్పడంతో..  ‘అంటే సుందరానికీ’ చిత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ‘‘సుందర్ ప్రసాద్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్. థ్యాంక్యూ పవన్ కల్యాణ్ గారు. ఈ విషయం తెలిసి చిత్రయూనిట్, నేను ఎంతగానో థ్రిల్ అయ్యాం. 9న జరిగే ప్రీ రిలీజ్ వేడుక కోసం ఎంతగానో వేచిచూస్తున్నాం..’’ అని నాని ట్వీట్ చేశారు. కాగా.. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు నటించిన ఈ చిత్రం తమిళంలో ‘అడాడే సుందరా’ (Adade Sundara) టైటిల్‌తోనూ, మలయాళంలో ‘ఆహా సుందరా’ (Aha Sundara) టైటిల్‌తోనూ జూన్ 10న మూడు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది.



Updated Date - 2022-06-08T01:32:26+05:30 IST