Pawan Kalyan: బాబులకే బాబు... కళ్యాణ్ బాబు

ABN , First Publish Date - 2022-09-02T22:33:17+05:30 IST

బాబులకే బాబు... కళ్యాణ్ బాబు. ఈ మాట ప్రసాద్ మల్టీప్లెక్స్ అంతటా గత మూడు రోజుల నుంచీ ప్రతిధ్వనిస్తోంది. మామూలుగా విడుదలైన సినిమాలకి ప్రమోషన్స్ చేసి.. ఆ సినిమాలో నటించే..

Pawan Kalyan: బాబులకే బాబు... కళ్యాణ్ బాబు

బాబులకే బాబు... కళ్యాణ్ బాబు. ఈ మాట ప్రసాద్ మల్టీప్లెక్స్ అంతటా గత మూడు రోజుల నుంచీ ప్రతిధ్వనిస్తోంది. మామూలుగా విడుదలైన సినిమాలకి ప్రమోషన్స్ చేసి.. ఆ సినిమాలో నటించే యాక్టర్స్ థియేటర్స్‌కి వచ్చినా కూడా రాని ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాత సినిమా జల్సా (Jalsa) మళ్ళీ విడుదలైతే కిక్కిరిసి పోతున్నారు. అదీ పవన్ కళ్యాణ్ స్టామినా, పవర్. టీన్స్, యువత, మిడిల్ ఏజ్, పెద్ద వాళ్ళు.. ఇలా అన్ని వయస్సుల వాళ్ళు జల్సా సినిమాని చూడటానికి వచ్చినవాళ్లే. సినిమా అయ్యాక అక్కడ పండగే. అభిమానులు పవన్ కళ్యాణ్‌ని అనుకరించడానికే అన్నట్టు మెడలో ఒక ఎర్ర తువ్వాలు వేసుకొని రావటం, సందడి చేయడం పరిపాటి. 


గత మూడు రోజులుగా ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జల్సా సినిమాకి ఇన్ని షోస్ వేయడమే ఒక పెద్ద రికార్డు. చాలా సినిమాలు వేశారు, కానీ అవన్నీ డైరెక్ట్ రిలీజ్ సమయంలో. అయితే, ఈ జల్సా అనే సినిమా 20 ఏళ్ళ తరువాత విడుదలైంది. దీనికి ఇంత డిమాండ్ ఏంటి...? అని అందరూ విస్తుపోతున్నారు. తిరునాళ్లకు వచ్చినట్టుగా అభిమానులు వస్తూనే వున్నారు, చూస్తూనే వున్నారు. సినిమా అయ్యాక మల్టీప్లెక్స్ మొత్తం పవన్ కళ్యాణ్ స్లొగన్స్‌తో మారుమోగిపోతుంది. 'బాబులకే బాబు కళ్యాణ్ బాబు' అన్న స్లోగన్ అయితే మరీనూ. ఇంతవరకు ఎటువంటి యాక్టర్‌కి ఇంత హుంగామా చూడలేదు. కానీ, పవన్ కళ్యాణ్‌కి మాత్రమే సాధ్యం.. అనేట్టు ఈ మూడు రోజులు ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వేసిన ఈ సినిమాని చూసి ప్రేక్షకులు ఉత్సాహంగా ఎంజాయ్ చేశారు.


‘మా అయ్యా చూస్తే తిడతాడురా’ అని ఒక అబ్బాయి, ‘మా డాడీ చూస్తే కాలేజీకి వెళ్లకుండా జల్సాకి వెళ్ళింది అని తిడతారు’ అంటూ ఓ అమ్మాయి అనుకుంటూ బయట రివ్యూల కోసం కెమెరాలు పెట్టిన మీడియా వాళ్ళకి దొరకకుండా సినిమా చూసి వెళ్లిపోతున్నారు. కొందరు అయితే ఏంటిరా బాబు ఇంత అభిమానం ఇంతమంది అభిమానులను ఒక యాక్టర్‌కి చూడటం ఇదే మొదటిసారి అంటారు. పవన్ కళ్యాణ్ అందరిలా బయటకి వచ్చి సినిమాల గురించి, ప్రమోషన్స్ చేయడం లాంటివి తక్కువ. అయినా కూడా అభిమానుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. కానీ, తరగటం లేదు. madness అని ఇంగ్లీష్‌లో అంటారు.. అంటే ఇదేనేమో అనిపిస్తుంది.

Updated Date - 2022-09-02T22:33:17+05:30 IST