నరేష్ తో పెళ్లి వార్తలపై స్పందించిన: Pavithra Lokesh

ABN , First Publish Date - 2022-07-01T22:21:30+05:30 IST

ఎట్టకేలకు నరేష్ తో పెళ్లి వార్తలపై స్పందించారు పవిత్ర లోకేష్ (Pavithra Lokesh). గత కొన్ని రోజులుగా తెలుగు, కన్నడ ఇండస్ట్రీలలో నటుడు నరేష్ (Naresh), నటి పవిత్రా లోకేష్ సంబంధం

నరేష్ తో పెళ్లి వార్తలపై స్పందించిన: Pavithra Lokesh

ఎట్టకేలకు నరేష్ తో పెళ్లి వార్తలపై స్పందించారు పవిత్ర లోకేష్ (Pavithra Lokesh). గత కొన్ని రోజులుగా తెలుగు, కన్నడ ఇండస్ట్రీలలో నటుడు నరేష్ (Naresh), నటి పవిత్రా లోకేష్ సంబంధం గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారంటూ కన్నడ మీడియాలో వార్తలు కూడా వచ్చి వైరల్  అయ్యాయి. ఈ వార్తలపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) బెంగుళూరులో ప్రెస్ మీట్ పెట్టారు. నరేష్ తో తన వైవాహిక బంధం ఇంకా తెగిపోలేదని, తాను ఇంకా విడాకుల పేపర్లపై సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ తాను నరేష్ భార్యనే అని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. అయితే, తన గురించి, తన పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడటం నరేష్ కి తగదని రమ్య అన్నారు.


పవిత్రా లోకేష్ తో తన సంబంధం గురించి నరేష్ స్పందించారు. ఇటీవల ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. “నేను మగవాడ్ని ..  మనిషిని. నాకు ఓ ఎమోషనల్ సపోర్టు కావాలి, స్నేహం కావాలి. నేను ‘హ్యాపీ వెడ్డింగ్’సినిమా సమయంలో పవిత్రా లోకేష్ ను కలిశాను. మేము ఫ్రెండ్స్ మాత్రమే. ‘సమ్మోహనం’ సమయంలో మేము కనెక్ట్ అయ్యాం. మేము పరస్పరం మా కష్టసుఖాలు కలబోసుకున్నాం. అలా ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అయింది. నా ఫ్యామిలీ ఫ్రెండ్ అయింది. అందరూ అంటున్నట్లుగా  ఆమె నా ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నింటిలో ఉంటుంది. ‘రమ్య!  ఫ్యామిలీ ఫంక్షన్లలో నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడో ఎవరితోనో ఉన్నావు.’ అదంతా నేను చెప్పాలనుకోవటం లేదు..” అన్నారు.


నరేష్ మూడవ భార్య రమ్య మీడియాకి ఎక్కడం మీద పవిత్ర లోకేష్ కూడా స్పందించారు. బెంగుళూరులో ప్రెస్ మీట్స్ పెట్టి అలా అసత్య ఆరోపణలు చేయడం కేవలం ప్రచారకాంక్షతోనే అని ఆమె ప్రత్యారోపణ చేశారు. ఇక తన భర్తగా చెప్పుకుంటున్న కన్నడ దర్శకుడు సుఖేంద్ర ప్రసాద్ (Suchendra Prasad)ను తాను పెళ్లి చేసుకోలేదన్నారు. తమకు అధికారికంగా పెళ్లి జరగలేదన్నారు. సుఖేంద్ర ప్రసాద్ తో 2017లోనే విడిపోయినట్టుగా చెప్పిన పవిత్ర లోకేష్..ప్రస్తుతం నరేష్ కు తోడుగా  ఉంటున్నట్టు ఓపెన్ అయ్యారు.  ‘నరేష్ జెంటిల్మేన్.. ‘ అని ఆమె చెప్పుకొచ్చారు. తన జీవితంలో జరిగినదంతా నరేష్ తనతో చెప్పుకున్నారని, మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేవు అనీ అన్నారామె. ఆయన వ్యక్తిగత విషయాలు ఆయనే చూసుకుంటున్నారు, నావి నేనే చూసుకుంటున్నాను; ఈ విషయంలో మా ఇద్దరికీ క్లారిటీ ఉందని పవిత్ర అన్నారు.

Updated Date - 2022-07-01T22:21:30+05:30 IST