National Film Award winners: పవన్‌కల్యాణ్‌ ప్రశంసలు

ABN , First Publish Date - 2022-07-23T00:10:45+05:30 IST

68వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలను పవన్‌కల్యాణ్‌ అభినందించారు. ఈసారి పురస్కారాలను ఎక్కువ శాతం దక్షిణ భారత చిత్రసీమ నుంచి వచ్చిన చిత్రాలు దక్కించుకోవడం సంతోషించదగ్గ పరిణామమని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

National Film Award winners: పవన్‌కల్యాణ్‌ ప్రశంసలు

68వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలను పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan)అభినందించారు. ఈసారి పురస్కారాలను ఎక్కువ శాతం దక్షిణ భారత చిత్రసీమ నుంచి వచ్చిన చిత్రాలు దక్కించుకోవడం సంతోషించదగ్గ పరిణామమని ఆయన అన్నారు.  ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్‌.ఎస్‌.తమన్‌((SS Thaman), ఉత్తమ కొరియోగ్రఫీ శ్రీమతి సంధ్యా రాజు (Sandhya raju)(నాట్యం), ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌  టి.వి.రాంబాబు (నాట్యం), ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్‌ ఫోటో’ జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది.  వీరందరికీ నా అబి?నందనలు, ఈ స్ఫూర్తితో వీరి నుంచి  మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. (National Film Award winners)

 

Updated Date - 2022-07-23T00:10:45+05:30 IST