Tollywood: పార్వతీశం, ఐశ్వర్య జంటగా.. సందేశాత్మక యాక్షన్ లవ్ స్టోరీ

ABN , First Publish Date - 2022-05-13T23:31:15+05:30 IST

‘కేరింత’ (Kerintha) చిత్ర ఫేమ్ పార్వతీశం (Parvathisham), జబర్దస్త్ ఫేమ్ ఐశ్వర్య (Ishwarya) హీరోహీరోయిన్లుగా.. వేదుల బాలకామేశ్వరి (Vedula Bala Kameswari) సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ

Tollywood: పార్వతీశం, ఐశ్వర్య జంటగా.. సందేశాత్మక యాక్షన్ లవ్ స్టోరీ

‘కేరింత’ (Kerintha) చిత్ర ఫేమ్ పార్వతీశం (Parvathisham), జబర్దస్త్ ఫేమ్ ఐశ్వర్య (Ishwarya) హీరోహీరోయిన్లుగా.. వేదుల బాలకామేశ్వరి (Vedula Bala Kameswari) సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ (Sai Siddhartha Movie Makers) నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ (Devarakondalo Vijay Premakatha) చిత్ర దర్శకుడు వెంకటరమణ ఎస్ (Venkata Ramana S) తన ద్వితీయ ప్రయత్నంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సిద్ధార్థ హరియాల (Siddhartha Hariyala), తాలబత్తుల మాధవి (Taalabatthula Madhavi) నిర్మాతలు. విలన్‪గా రామరాజు (Ramaraju) నటిస్తున్నారు. సామాజిక నేపథ్యంతో యాక్షన్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ నెల 25వ తేదీ నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 


ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ ఎస్. మాట్లాడుతూ.. ‘‘ఈ సమాజంలో ప్రతి మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 చెబుతోంది. అయితే దీనికి భిన్నంగా నేటి సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మారాలి. ఆర్టికల్ 20 (Article 20) స్ఫూర్తిని కాపాడుకోవాలి అని చెప్పే చిత్రమిది. మంచి సామాజిక సందేశంతో పాటు ఓ విభిన్నమైన ప్రేమకథను ఈ సినిమాలో చూపిస్తున్నాం..’’ అన్నారు.


నిర్మాతలు సిద్ధార్థ హరియాల, తాలబత్తుల మాధవి మాట్లాడుతూ.. ‘‘సమాజాన్ని, సమాజాన్ని పాలించే ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే చిత్రమిది. సామాజిక సందేశాన్ని ప్రేమకథతో మిళితం చేసిన ఇటువంటి మంచి కథతో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. కాకినాడ, యానం, పరిసర ప్రాంతాల్లో భారీ  షెడ్యూల్ ప్లాన్ చేశాం. తర్వాత హైదరాబాద్‪లో జరిగే రెండో షెడ్యూల్‪తో సినిమా కంప్లీట్ అవుతుంది. మొత్తం 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయనున్నాం. ఈ సందేశాత్మక ప్రేమ కథలో యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉంటుంది’’ అని తెలిపారు. 

Updated Date - 2022-05-13T23:31:15+05:30 IST