‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ గురించి అందాల రాశి ఏమంటోందంటే...

ABN , First Publish Date - 2021-12-22T02:35:49+05:30 IST

బాలీవుడ్ అందాల రాశి పరిణీతి చోప్రా ‘యానిమల్’ అనే సినిమా చేస్తోంది. దానికి డైరెక్టర్ మన టాలెంటెడ్ తెలుగు ఫిల్మ్ మేకర్ సందీప్ వంగానే. ‘కబీర్ సింగ్’ పేరుతో సందీప్ ఇప్పటికే తన బ్లాక్ బస్టర్ డెబ్యూ మూవీ ‘అర్జున్ రెడ్డి’ని బీ-టౌన్‌లో రీమేక్ చేశాడు...

‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ గురించి అందాల రాశి ఏమంటోందంటే...

బాలీవుడ్ అందాల రాశి పరిణీతి చోప్రా ‘యానిమల్’ అనే సినిమా చేస్తోంది. దానికి డైరెక్టర్ మన టాలెంటెడ్ తెలుగు ఫిల్మ్ మేకర్ సందీప్ వంగానే. ‘కబీర్ సింగ్’ పేరుతో సందీప్ ఇప్పటికే తన బ్లాక్ బస్టర్ డెబ్యూ మూవీ ‘అర్జున్ రెడ్డి’ని బీ-టౌన్‌లో రీమేక్ చేశాడు. దాంతో ముంబైలోనూ మన టాలీవుడ్ డైరెక్టర్ చర్చగా బాగానే సాగుతోంది. ఆయన అప్‌కమింగ్ మూవీ ‘యానిమల్’లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది జూనియర్ చోప్రా, ప్రియాంక చోప్రా చెల్లెలు... పరిణీతి!


షాహిద్ కపూర్, కియారా అద్వానీ స్టారర్ ‘కబీర్ సింగ్’ బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది. అటువంటి సూపర్ హిట్ మూవీ డైరెక్టర్ సందీప్ వంగాని పరిణీతి తెగ పొగిడేస్తోంది. ‘‘నేను నిజంగా ఎప్పట్నుంచో ఆయనతో వర్క్ చేయాలని ఎదురు చూస్తున్నాను’’ అంది బబ్లీ పంజాబీ బ్యూటీ.  ‘‘నాలోంచి... నాకే గతంలో ఎన్నడూ తెలియని ఏదో ఒక కొత్త కోణాన్ని ఆయన తప్పకుండా వెలికి తీస్తారని నేను భావిస్తున్నాను!’’ అని కూడా నమ్మకంగా చెబుతోంది పరీ. ఆమె అంతగా ఆశలు పెట్టుకున్న సందీప్ వంగా సెకండ్ బాలీవుడ్ మూవీ ‘యానిమల్’లో రణబీర్ కపూర్, అనీల్ కపూర్, బాబీ డియోల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చూడాలి మరి, మన తెలుగు తేజం బాలీవుడ్‌లో మున్ముందు ఎలా సత్తా చాటుతాడో... 

Updated Date - 2021-12-22T02:35:49+05:30 IST