Priyanka Chopra గురించి Parineeti Chopra హార్ట్ టచింగ్ కామెంట్స్.. Soldier in hospital అంటూ..

ABN , First Publish Date - 2022-05-11T19:59:24+05:30 IST

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. అనంతరం హాలీవుడ్‌లో పాగా వేసిన నటి ప్రియాంక చోప్రా. అక్కడ కూడా వరుసగా సినిమాలు..

Priyanka Chopra గురించి Parineeti Chopra హార్ట్ టచింగ్ కామెంట్స్.. Soldier in hospital అంటూ..

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. అనంతరం హాలీవుడ్‌లో పాగా వేసిన నటి ప్రియాంక చోప్రా. అక్కడ కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాకుండా కొన్నేళ్లక్రితం ఈ భామ, ప్రముఖ పాప్ సింగర్, హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవలే ఈ జంటకి సరోగసీ ద్వారా ఓ పాప జన్మించింది.  తాజాగా మదర్స్ డే సందర్భంగా కూతురు, భర్తతో ఉన్న ఫొటో షేర్ చేసిన ప్రియాంక భావోద్వేగ పోస్ట్ చేసింది.


ప్రియాంక చేసిన పోస్ట్‌లో.. ‘ఈ మాతృదినోత్సవం రోజున  గత కొన్ని నెలలుగా మేం అనుభవించిన టెన్షన్ గురించి గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నాం. ఇలాంటి అనుభవాలు చాలామందికి కలిగే ఉంటాయని  తెలుసు. NICUలో 100రోజులకు పైగా ఉన్న తర్వాత మా చిన్నారి పాప ఇంటికి వచ్చింది. ఎంతో కష్టం తర్వాత తను మా ఇంటికి చేరినందుకు చాలా సంతోషిస్తున్నాం. 


రాడి చిల్డ్రన్స్ లా జొల్లా, లాస్ ఏంజిల్స్‌లోని సెడార్ సినాయ్‌లో నిస్వార్థంగా సేవ చేసిన ప్రతి డాక్టర్, నర్సు, స్పెషలిస్ట్‌లకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం. మా తదుపరి అధ్యాయం ఇప్పుడు ప్రారంభమవుతుంది. 'బేబీ.. అమ్మ, నాన్న నిన్ను ప్రేమిస్తున్నారు'. నా జీవితంలోని, ప్రపంచంలోని తల్లులు, సంరక్షకులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ ప్రియాంక తన  పోస్టులో పేర్కొంది. 


ప్రియాంక పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. అందులో ప్రియాంక సోదరి, నటి పరిణితీ చోప్రా కూడా ఉంది.  ''గత మూడు నెలలుగా మీ ఇద్దరినీ అలాంటి పరిస్థితుల్లో చూడటం చాలా కష్టంగా అనిపించింది. మరో పక్క స్ఫూర్తిదాయకంగా ఉంది. అక్క..  నేను ఆసుపత్రిలో ఒక సైనికురాలిని చూశాను. ఆ చిన్నారి తనకు తెలియకుండానే మాకు చాలా నేర్పింది. పదా.. ఇప్పుడు పాపలో మార్పు తెచ్చే సమయం ఆసన్నమైంది’ అంటూ ఓ వైపు ఎమోషనల్‌గా, మరోవైపు ఫన్నీగా కామెంట్ చేసింది. అలాగే.. అనుష్క శర్మ సైతం స్పందిస్తూ, ‘నీలోని ఎంతో బలమైన అమ్మ అందుకో మా ప్రేమ. ఆ చిన్నారికి ప్రేమతోపాటు ఆశీర్వాదాలు ఉంటాయి’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ప్రియాంక పోస్ట్‌పై ప్రీతి జింటా, సోనమ్ కపూర్, కాజర్ అగర్వాల్, సానియా మీర్జా వంటి ప్రముఖ తారలు సైతం కామెంట్స్ చేసి వారిపై తమ ప్రేమను వ్యక్తపరిచారు.



Updated Date - 2022-05-11T19:59:24+05:30 IST