Radhe Shyam's Failure: కారణం ఏంటో చెప్పేసిన ప్రభాస్

ABN , First Publish Date - 2022-04-20T14:57:42+05:30 IST

‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన నటుడు ప్రభాస్. ఈ మూవీ తర్వాత ఆయన చేసేవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే...

Radhe Shyam's Failure: కారణం ఏంటో చెప్పేసిన ప్రభాస్

‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన నటుడు ప్రభాస్. ఈ మూవీ తర్వాత ఆయన చేసేవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. అయితే.. ‘బాహుబలి 2’ తర్వాత ఈ స్టార్ చేసిన ‘సాహో’ యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఇటీవలే విడులైన మరో మూవీ ‘రాధేశ్యామ్’ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ స్పందించాడు.


ప్రభాస్ మాట్లాడుతూ.. ‘నన్ను రొమాంటిక్ హీరోగా చూడాలని ప్రేక్షకులు కోరుకోవట్లేదు అనుకుంటా. లేకపోతే అందులో చాలా మంచి వ్యక్తిగా చూడాలని కోరుకున్నారేమో తెలియదు. కోవిడ్ వల్ల అలా జరిగిందో లేక మేమే కథలో ఏదైనా మిస్ అయ్యామో. అలాకాకుంటే నన్ను అలా ఆ జోన్‌లో చూడడం ఆడియన్స్‌కి నచ్చలేదేమో’ అని చెప్పుకొచ్చాడు. 


అలాగే, ‘బాహుబలి’ ప్రెజర్ తనపై ఉందా లేదా అనే గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ‘బాహుబలిని మించిన పెద్ద సినిమా చేయాలనే ఒత్తిడి నామీద లేదు. కానీ.. అది నాతో సినిమాలు తీసే దర్శకులు, నిర్మాతలపై ఉండొచ్చు. నాకు సంబంధించినంత వరకు మంచి పాత్రలతో, నటనతో ప్రేక్షకులని అలరించడమో ఓ నటుడి బాధ్యత’ అని తెలిపాడు.

Updated Date - 2022-04-20T14:57:42+05:30 IST