‘పక్కా కమర్షియల్’: సిరివెన్నెల రాసిన టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల

ABN , First Publish Date - 2022-01-31T22:05:23+05:30 IST

మాచో స్టార్ గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్ర మొదటి సింగిల్‌ను

‘పక్కా కమర్షియల్’: సిరివెన్నెల రాసిన టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల

మాచో స్టార్ గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్ర మొదటి సింగిల్‌ను ఫిబ్రవరి 2న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాటకున్న ప్రత్యేకత ఏమిటంటే.. దివంగత లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి‌ ఈ స్ఫూర్తి దాయక గీతాన్ని రాశారు. 


ప్రస్తుతం విడుదలైన ప్రోమోలో హీరో గోపీచంద్.. చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. మేనరిజమ్స్ కూడా హైలెట్ అనేలా ఉన్నాయి. ఈ పాటని జ‌కేస్ బీజాయ్, హేమచంద్ర ఆలపించారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 2న పూర్తి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది.  



Updated Date - 2022-01-31T22:05:23+05:30 IST