Pakka Commercial: ట్రైలర్ వదిలేది అక్కడే..!

ABN , First Publish Date - 2022-06-12T01:37:27+05:30 IST

మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోహీరోయిన్లుగా సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్..

Pakka Commercial: ట్రైలర్ వదిలేది అక్కడే..!

మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోహీరోయిన్లుగా సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో..  జీఏ2 పిక్చర్స్ (GA2 Pictures) - యూవీ క్రియేష‌న్స్ (UV Creations) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బ‌న్నీ వాస్ (Bunny Vas) నిర్మాత‌. జూలై 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. హీరో గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 12న చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 


ఈ ట్రైలర్‌ను జూన్ 12 సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో ఉన్న ఏసియన్ సినిమాస్ లలితకళా థియేటర్‌లో జరిగే ఈవెంట్‌లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. గోపీచంద్ పాత్రని.. ఇప్పటి వరకు తన కెరియర్‌లో లేనంత కొత్తగా మారుతి ఈ చిత్రంలో డిజైన్ చేసినట్లుగా నిర్మాతలు తెలుపుతున్నారు. ఇంతకుముందు మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో మంచి పాత్రలో నటించిన సత్యరాజ్‌ని.. మరోసారి మారుతి కీలక పాత్రలో చూపించబోతున్నారు. కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందించగా.. SKN సహ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.



Updated Date - 2022-06-12T01:37:27+05:30 IST