ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ అందుకున్న Pakka Commercial

ABN , First Publish Date - 2022-07-04T18:17:27+05:30 IST

మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), విలక్షణ దర్శకుడు మారుతి (Maruthi) కాంబినేషన్లో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది.

ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ అందుకున్న Pakka Commercial

మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), విలక్షణ దర్శకుడు మారుతి (Maruthi) కాంబినేషన్లో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇందులో గోపీచంద్ చాలా స్టైలిష్ గా పెర్ఫార్మ్ చేశాడు. రాశీ ఖన్నా (Rashi Khanna) క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేసాడు మారుతి. ఈ సినిమా కోసం పబ్లిసిటీతో కలుపుకొని దాదాపు 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. అందులో 32 కోట్లు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్, శాటిలైట్, హిందీ రీమేక్, డబ్బింగ్ అన్ని) రూపంలోనే వచ్చాయి. 


ఇక ఈ  సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అందుకే ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది. ఇంత ప్లానింగ్ ఉంటుంది కాబట్టే మారుతి మోస్ట్ బ్యాంకబుల్ డైరెక్టర్ అయ్యాడు. మొదటి రోజు 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత రెండు రోజులు బాగానే క్యాష్ చేసుకుంది.  ఓవరాల్ గా ‘పక్కా కమర్షియల్’ మూడు రోజుల్లోనే సేఫ్ అయిపోయింది. దాంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో గోపీచంద్ ఖాతాలో పెద్ద హిట్ పడినట్టే. ప్రభాస్ (Prabhas) తో తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసుకొన్న మారుతికి ఈ సినిమా విజయం శుభసూచకమని చెప్పాలి. 


నీతికి, న్యాయానికి మారు మారుపేరైన ఒక న్యాయమూర్తికి, ‘పక్కా కమర్షియల్’ లాయర్ అయిన ఆయన కొడుకుకు మధ్య జరిగే న్యాయపోరాటమే ఈ సినిమా కథాంశం. న్యాయమూర్తిగా సత్యరాజ్ (Satyaraj) తనదైన శైలిలో మెప్పించారు. ప్రతీదాన్ని డబ్బుతో ముడిపెట్టి.. దాన్ని తనకు అనుగుణంగా కమర్షియల్ గా మలుచుకొనే యంగ్ లాయర్ పాత్రలో గోపీచంద్ అదరగొట్టాడు. మారుతి స్టైలాఫ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా .. లాంగ్ రన్ లో ఇంకెంతటి వసూళ్ళు రాబడుతుందో చూడాలి. 

Updated Date - 2022-07-04T18:17:27+05:30 IST