Pakka Commercial: ఆకట్టుకుంటున్న 'అందాల రాశీ' సాంగ్ టీజ‌ర్

ABN , First Publish Date - 2022-05-28T17:37:55+05:30 IST

పక్కా కమర్షియల్ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్

Pakka Commercial: ఆకట్టుకుంటున్న 'అందాల రాశీ' సాంగ్ టీజ‌ర్

అందాల రాశీ..మేకప్ వేసి

నాకోసమొచ్చావే..

స్వర్గంలో కేసే నామీదేసి

బూమ్మీద మూశావే..


నరుడా వకీలా

పని నేర్పుతా రా..

నను చేర్చుకోరా రెడీగా ఉన్నా రా..


అంటూ ఆకట్టుకుంటున్న ఈ లిరిక్స్ పక్కా కమర్షియల్ (Pakka Commercial) సినిమాలోని 'అందాల రాశీ' అనే పాట లోనివి. ప్ర‌తిరోజు పండ‌గే (Prati Roju Pandage) లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత గోపీచంద్ హీరో ద‌ర్శ‌కుడు మారుతి (Maruthi) చేస్తున్న సినిమాని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ (Allu Aravind) స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లు జీఏ2 పిక్చ‌ర్స్ (GA2 Pictures) - యూవీ క్రియేష‌న్స్ (UV Creations) క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు (Bunny Vasu) నిర్మిస్తున్నారు. ఈ టైటిల్‌కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. 




ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని 'అందాల రాశీ' పాట జూన్ 1న విడుదల కానుంది. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన టీజ‌ర్ విడుదలై, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 


ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్‌లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌. జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. 



Updated Date - 2022-05-28T17:37:55+05:30 IST