లతాజీ పాటలకు పాకిస్థాన్ నియంత కూడా అభిమానే..!

ABN , First Publish Date - 2022-02-07T01:34:54+05:30 IST

ఆయనో దేశాధ్యక్షుడు. క్రూరమైన నియంత. దేశంలో కళా ప్రదర్శనలు ఇవ్వడంపై

లతాజీ పాటలకు పాకిస్థాన్ నియంత కూడా అభిమానే..!

ఆయనో దేశాధ్యక్షుడు. క్రూరమైన నియంత. దేశంలో కళా ప్రదర్శనలు ఇవ్వడంపై నిషేధం విధించిన వ్యక్తి. ఇంతటి నియంత కూడా లతా మంగేష్కర్ స్వరం నుంచి వచ్చిన పాటలకు ఫిదా అయిపోయేవాడు. ఇంతకీ మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అనే కదా మీ సందేహం.. అతడెవరో కాదు పాకిస్థాన్ నియంత జియా ఉల్ హక్. లతా మంగేష్కర్‌కు తానూ అభిమానినే అంటూ గతంలో అతడే స్వయంగా అంగీకరించడం విశేషం. దివంగత పాత్రికేయుడు కుల్దీప్ నాయర్‌కు 1982లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లతాజీపై ఉన్న అభిమానాన్ని జియా ఉల్ హక్ ఒప్పుకున్నాడు. 


భారత్ నుంచి ఏదైనా కళా బృందం పాకిస్థాన్‌కు వచ్చి ప్రదర్శన ఇవ్వాలనుకుంటే అందుకు పాక్ స్వాగతించడం లేదని భారతీయులు అనుకుంటున్నారని జియా ఉల్ హక్ వద్ద కుల్దీప్ నాయర్ ప్రశ్నించారు. లతా మంగేష్కర్‌తో సహా మరికొందరు గాయకులతో కూడిన బృందం పాక్‌లో ప్రదర్శన ఇచ్చే అంశాన్ని జియా ఉల్ హక్ వద్ద ప్రస్తావించారు. ‘‘అందుకు నేను బాధ్యుడిని. లతాజీ అంటే నాకెంతో అభిమానం. కానీ, పాకిస్థాన్‌లో వారు సంగీత ప్రదర్శన ఇవ్వాలనుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో నేను అంగీకరించను. పాకిస్థాన్ స్ఫూర్తికి ఈ సంగీత ప్రదర్శనలనేవి వ్యతిరేకం’’ అని జియా ఉల్ హక్ సమాధానమిచ్చాడు.

Updated Date - 2022-02-07T01:34:54+05:30 IST