Banned: తమ ఆస్కార్ 2023 ఎంట్రీ మూవీని నిషేధించిన పాక్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-11-14T20:11:45+05:30 IST

పాకిస్థాన్ నుంచి ‘జాయ్‌ల్యాండ్’ (Joyland0 అనే చిత్రాన్ని అక్కడి ప్రభుత్వం ఆస్కార్స్ 2023 కోసం అధికారికంగా ఎంపిక చేసింది...

Banned: తమ ఆస్కార్ 2023 ఎంట్రీ మూవీని నిషేధించిన పాక్ ప్రభుత్వం

పాకిస్థాన్ నుంచి ‘జాయ్‌ల్యాండ్’ (Joyland0 అనే చిత్రాన్ని అక్కడి ప్రభుత్వం ఆస్కార్స్ 2023 కోసం అధికారికంగా ఎంపిక చేసింది. అంతేకాకుండా.. ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేసేందుకు నెల రోజుల క్రితమే అనుమతి కూడా ఇచ్చింది. దీంతో ఈ చిత్రం నవంబర్ 18న విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ సినిమాతో సాధిఖ్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాలో అభ్యంతరకరమైన కంటెంట్ ఉందనే నెపంతో ఈ చిత్రాన్ని పాకిస్థాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధించింది.


ఈ విషయాన్ని తెలుపుతూ సమాచార మంత్రిత్వ శాఖ.. ‘ఈ చిత్రంలో మన సమాజంలోని సామాజిక విలువలు, నైతిక ప్రమాణాలకు విరుద్ధమైన అంశాలు ఉన్నాయి. అత్యంత అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని, 1979 చలనచిత్ర ఆర్డినెన్స్ సెక్షన్ 9లో పేర్కొన్న 'మర్యాద మరియు నైతికత' నిబంధనల కింద ఫిర్యాదులు అందాయి. అందుకే ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా నిషేధిస్తున్నాం’ అని నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఓ యువకుడు పరాయి దేశంలో డ్యాన్స్ థియేటర్స్‌లో ట్రైనింగ్ కోసం చేరతాడు. ఆ సమయంలో ఓ ట్రాన్స్‌జెండర్ అయిన మహిళతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ చిత్ర కథ. కాగా.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శంచిన మొదటి పాకిస్థానీ సినిమా ఇదే. ఆ ఫెస్టివల్‌ జ్యూరీ ప్రైజ్‌ని కూడా గెలుచుకుంది.

Updated Date - 2022-11-14T20:11:45+05:30 IST