నెట్‌‌ఫ్లిక్స్ ‘రెసిడెంట్ ఈవిల్’ సిరీస్‌లో పాక్ నటుడు

ABN , First Publish Date - 2022-03-20T02:08:02+05:30 IST

ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ నిర్మించే షోలకు ప్రపంచవ్యాప్తంగా

నెట్‌‌ఫ్లిక్స్ ‘రెసిడెంట్ ఈవిల్’ సిరీస్‌లో పాక్ నటుడు

ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ నిర్మించే షోలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్ నిర్మించిన ‘నార్కోస్’ సిరీస్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ సినిమా స్థాయి బడ్జెట్‌లకు ఏ మాత్రం తీసిపోకుండా ఆ సంస్థ ఈ సిరీస్‌లకు ఖర్చు పెడుతుంటుంది. కొన్ని నెలల క్రితమే ఆ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ‘స్క్విడ్ గేమ్’ ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది.


తాజాగా నెట్‌ఫ్లిక్స్ ‘రెసిడెంట్ ఈవిల్’ అనే సిరీస్‌ను నిర్మిస్తుంది. ఈ సిరీస్‌లో ఓ పాకిస్తా‌నీ నటుడు కనిపించనున్నాడు. పాక్‌కు చెందిన అహద్ రజా మీర్ ఈ షోలో నటించనున్నాడు. అతడి పాత్రకు సంబంధించిన వివరాలు ఇంతవరకు బయటికి రాలేదు. ఓ వీడియో గేమ్‌ను ఆధారంగా చేసుకుని ఈ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. హాలీవుడ్‌కు చెందిన అనేక మంది తారలు కూడా ఈ సిరీస్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ షో జులై 14నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. భిన్నమైన పాత్రలు పోషిస్తాడని పాకిస్తాన్ ఎంటర్ టైన్‌మెంట్ ఇండస్ట్రీలో అహద్ రజా మీర్‌కు మంచి పేరు ఉంది. ‘అకీన్- కా- సఫర్’, ‘అహద్-ఎ-వఫా’, ‘ధూప్- కీ- దీవార్’ వంటి చిత్రాల్లో అతడు నటించి అభిమానులను అలరించాడు.

Updated Date - 2022-03-20T02:08:02+05:30 IST