Kamal Haasan, Pa Ranjith కాంబోలో మూవీ.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చిన దర్శకుడు

ABN , First Publish Date - 2022-07-18T18:41:26+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో తమిళంతోపాటు తెలుగులోనూ గుర్తింపు పొందిన డైరెక్టర్ పా రంజిత్..

Kamal Haasan, Pa Ranjith కాంబోలో మూవీ.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చిన దర్శకుడు

సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో తమిళంతోపాటు తెలుగులోనూ గుర్తింపు పొందిన డైరెక్టర్ పా రంజిత్ (Pa Ranjith). ఆ సినిమాలతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. అనంతరం కూడా ఆర్య, చియాన్ విక్రమ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. ఈ యంగ్ డైరెక్టర్ త్వరలో మరో స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్‌ (Kamal Haasan)తో సినిమా చేయనున్నట్లు తెలిపాడు. రంజిత్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమల్‌తో చేయబోయే సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.


రంజిత్ మాట్లాడుతూ.. ‘కమల్‌ హాసన్‌తో చేయబోయే చిత్రం మధురై నేపథ్యంలో సాగుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి నాకు బేసిక్ ఐడియా మాత్రమే ఉంది. ఈ డ్రామాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ను ఇంకా డెవలప్ చేయలేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే పూర్తి చేసిన తర్వాత కమల్‌ హాసన్‌కి కథ వినిపించి, ఆయన అభిప్రాయం తెలుసుకుంటాను. కానీ.. ఈ చిత్రాన్ని అందరినీ అలరించేలా తెరకెక్కిస్తానని మాత్రం చెప్పగలను’ అని తెలిపారు.


అయితే.. రంజిత్ ప్రస్తుతం చియాన్ విక్రమ్‌ (Vikram)తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ జులై 16న చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ‘చియాన్ 61’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 19వ శతాబ్దంలో కేజీఎఫ్ (KGF)లో జరిగిన అనేక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం పూర్తిగా స్వాతంత్ర్యానికి పూర్వ కథ ఆధారంగా సాగుతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకకాలంలో 3డిలో కూడా చిత్రీకరించనున్నారు. అదే సమయంలో.. కొన్ని సన్నివేశాలను KGF లో చిత్రీకరించడానికి మూవీ టీం ప్లాన్ చేస్తోంది. రంజిత్ ఈ చిత్రాన్ని పూర్తి చేసే లోపు కమల్ హాసన్ ఫిల్మ్ మేకర్ మహేష్ నారాయణన్‌తో ఓ చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెంచర్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Updated Date - 2022-07-18T18:41:26+05:30 IST