సమ్మర్ వేడిలో... సముద్ర తీరంలో... సేద తీరుతోన్న సన్నీ!

ABN , First Publish Date - 2022-03-24T00:29:28+05:30 IST

కరోనా కాలంలో ఇళ్లలోనే మగ్గిపోయిన హాట్ బ్యూటీస్ తరువాత షూటింగ్స్ హడావిడిలో పడిపోయారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఇప్పుడిప్పుడే కాస్త రిలాక్స్ అయ్యే మూడ్‌లోకి వెళుతున్నారు. మరీ ముఖ్యంగా, ఇండియన్ సెక్సీ సెలబ్రిటీలు చాలా మంది మాల్దీవుల బాటనే పడుతున్నారు...

సమ్మర్ వేడిలో... సముద్ర తీరంలో... సేద తీరుతోన్న సన్నీ!

కరోనా కాలంలో ఇళ్లలోనే మగ్గిపోయిన హాట్ బ్యూటీస్ తరువాత షూటింగ్స్ హడావిడిలో పడిపోయారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఇప్పుడిప్పుడే కాస్త రిలాక్స్ అయ్యే మూడ్‌లోకి వెళుతున్నారు. మరీ ముఖ్యంగా, ఇండియన్ సెక్సీ సెలబ్రిటీలు చాలా మంది మాల్దీవుల బాటనే పడుతున్నారు. ఆ దేశం ప్రత్యేకంగా మన వారికి స్వాగతం పలుకుతుండటంతో చాలా మంది సముద్ర తీరాన ప్రత్యక్షమవుతున్నారు. భారతీయ అందగత్తెల హడావిడితో మాల్దీవులకి మరోసారి క్రేజ్ పెరుగుతోందట!



మాల్దీవుల తీరాన ఈ మధ్యే ప్రత్యక్షమైంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఎప్పుడూ లేని విధంగా బికినీతో దర్శనమిచ్చి సొషల్ మీడియాలో హాహాకారాలు రేపింది! అయితే, తమన్నా కంటే ముందు కూడా చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీస్ మాల్దీవుల్లో బికినీ కార్నివల్‌కు తెర తీశారు. ఇక లెటెస్ట్‌గా సన్నీ లియోన్ రచ్చ మొదలు పెట్టింది. ఫ్యామిలీతో సహా అరేబియన్ సముద్ర దీవుల్లో సేద తీరుతోన్న ఆమె స్విమ్ సూట్ ట్రీట్ అందించింది. అసలే హాట్ లుక్స్‌కి తెగ ఫేమస్ అయిన సన్నీ సమ్మర్ వేడి మరి కాస్త పెంచేసింది. 


‘‘సాగరంలో... అందమైన సూట్ ధరించి...’’ అంటూ తన తాజా ఫోటోకి కాప్షన్ ఇచ్చింది సన్నీ. ప్రింటెడ్ మోనోకినీలో వయ్యారాలు పోయిన ‘డియ్యో డియ్యో’ సుందరి తడి ఆరని కురుల్ని గాల్లో అల్లాడిస్తూ... కుర్రాళ్లని కూడా అల్లాడించేసింది. మాల్దీవుల్నుంచీ తిరిగి వచ్చాక గార్జియస్ లేడీ ‘రంగీలా’ సినిమాతో మలయాళ తెరపై తొలిసారి మెరిసిపోనుంది. హిందీలో ఆమె నటించిన ‘హెలెన్’ అనే థ్రిల్లర్ మూవీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది...    

Updated Date - 2022-03-24T00:29:28+05:30 IST