మా జంట బాగుందంటున్నారు

ABN , First Publish Date - 2022-07-06T05:55:20+05:30 IST

‘‘ది వారియర్‌’లో నాది పక్కింటి అమ్మాయి తరహా పాత్ర. కథ వినగానే కనెక్ట్‌ అయ్యాను. నా పాత్ర పేరు విజిల్‌ మహాలక్ష్మి. తనొక ఆర్జే....

మా జంట బాగుందంటున్నారు

‘‘ది వారియర్‌’లో నాది పక్కింటి అమ్మాయి తరహా పాత్ర. కథ వినగానే కనెక్ట్‌ అయ్యాను. నా పాత్ర పేరు విజిల్‌ మహాలక్ష్మి. తనొక ఆర్జే. సాంగ్స్‌ చూసినవారంతా రామ్‌తో నా జోడీ బాగుందని మెచ్చుకుంటున్నారు’’ అని కృతిశెట్టి చెప్పారు. లింగుస్వామి దర్శకత్వంలో  శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన చిత్రమిది. ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృతిశెట్టి సినిమా విశేషాలను వివరిస్తూ...


లింగుస్వామి తీసిన ‘ఆవారా’ సినిమా నాకు చాలా ఇష్టం. అప్పట్లో రోజుకి రెండు మూడు సార్లు చూసేదాన్ని. ఆయన సినిమాల్లో వినోదంతో పాటు హీరోయిన్లకు నటనకు ఆస్కారమున్న పాత్రలు ఉంటాయి. లింగుస్వామి ఈ సినిమా కోసం నన్ను అడగడంతో చాలా సంతోషంగా అనిపించింది.  


రామ్‌తో సినిమా అనగానే కొంచెం బెరుగ్గా అనిపించింది. సెట్‌లో ఆయన చాలా కూల్‌గా ఉండేవారు. షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యాక ఫ్లోలో వెళ్లిపోయింది. ఎంజాయ్‌ చేస్తూ చేశాను. ‘బుల్లెట్‌’ సాంగ్‌ క్లాస్‌ అయితే ‘విజిల్‌’ సాంగ్‌ మాస్‌. నాకు కొంచెం ఎనర్జీ కావాలనుకున్నప్పుడల్లా విజిల్‌ సాంగ్‌ పెట్టుకొని డ్యాన్స్‌ చేస్తున్నాను. థియేటర్లలో ప్రేక్షకుల రియాక్షన్స్‌ చూసి నేను విజిల్‌ వేయడం పక్కా. పాటలకు ముందు వచ్చే సన్నివే శాలు బాగుంటాయి. 


వాయిస్‌ వినిపించినప్పుడు ఆర్జే కనిపించ కపోయినా ఎక్స్‌ప్రెషన్‌ ఫీలవ్వాలి. పాత్ర బాగా రావడానికి తెలుగు ఆర్జే వీడియోస్‌ చాలా చూశాను.


త్వరలో ‘మాచర్ల నియోజకవర్గం’తో ప్రేక్షకుల ముందుకొస్తాను. ప్రస్తుతం బాల దర్శకత్వంలో సూర్యకి జోడీగా ఓ చిత్రంలో నటిస్తున్నాను. అలాగే వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నాగచైతన్యతో ఓ చిత్రం అంగీకరించాను.

Updated Date - 2022-07-06T05:55:20+05:30 IST