ఓటీటీలోనూ పోటీపడుతున్న స్టార్ హీరోలు

ABN , First Publish Date - 2022-03-22T05:06:34+05:30 IST

స్టార్ హీరోలైన పవన్ కల్యాణ్, అజిత్‌లు ఓటీటీలోనూ పోటీ పడుతున్నారు. వారు చివరగా నటించిన చిత్రాలు థియేటర్లలో ఒక రోజు గ్యాప్‌తో వస్తే.. ఇప్పుడు ఓటీటీలో ఒకే రోజు పోటీ పడుతున్నాయి. పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం, అజిత్ నటించిన ‘వలీమై’ చిత్రం ఒకేరోజు

ఓటీటీలోనూ పోటీపడుతున్న స్టార్ హీరోలు

స్టార్ హీరోలైన పవన్ కల్యాణ్, అజిత్‌లు ఓటీటీలోనూ పోటీ పడుతున్నారు. వారు చివరగా నటించిన చిత్రాలు థియేటర్లలో ఒక రోజు గ్యాప్‌తో వస్తే.. ఇప్పుడు ఓటీటీలో ఒకే రోజు పోటీ పడుతున్నాయి. పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం, అజిత్ నటించిన ‘వలీమై’ చిత్రం ఒకేరోజు ఓటీటీలో విడుదలవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు విడుదలవుతున్న ఓటీటీలు మాత్రం ఒకటి కావు. వేరు వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇవి విడుదల అవుతున్నాయి. ‘భీమ్లా నాయక్’ చిత్రం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’, ‘ఆహా’ ఓటీటీలో విడుదల అవుతుంటే.. అజిత్ ‘వలీమై’ చిత్రం ‘జీ 5’లో విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్స్‌ని.. ఈ మూడు ఓటీటీలు బీభత్సంగా నిర్వహిస్తున్నాయి. 


‘భీమ్లా నాయక్’

పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్‌ప్లే-డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. థియేటర్లలో విడుదలైన మొదటి ఆట నుండే చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఏపీలో మినహా ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని అభిమానులు, ఓటీటీ సంస్థలు భావిస్తున్నాయి. నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు.


‘వలీమై’

అజిత్ కుమార్, కార్తికేయ, హుమా ఖురేషి ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంలో జీ స్టూడియోస్‌‌తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు. యాక్షన్, క్రైం అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల రోజు నుండి మిశ్రమ స్పందననే రాబట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కళ్లు చెదిరే కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికీ తమిళ నాడు థియేటర్లలో సందడి చేస్తున్న ఈ చిత్రంలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. బైక్ చేజింగ్ సీన్లు మంచి థ్రిల్ ఇస్తాయి. ఈ సినిమా కోసం కూడా అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. 

Updated Date - 2022-03-22T05:06:34+05:30 IST