స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్య కృష్ణ(Ramya Krishna), బ్రహ్మానందం (Brahmanamdam) కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఈ చిత్రానికీ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట.
‘రంగమార్తాండ’ డిజిటల్ రైట్స్‌ను రూ. 20కోట్లకు సొంతం చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ముందుకు వచ్చిందట. అయితే, మేకర్స్ ఈ ఆఫర్‌కు అంగీకారం తెలిపారో, లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ‘నట సామ్రాట్’ అనే మరాఠీ మూవీకీ రీమేక్‌గా ‘రంగమార్తాండ’ రూపొందుతోంది. రంగస్థలం నుంచి రిటైరయిన నటుడి జీవితాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారని తెలుస్తోంది. నాటకాల నుంచి రిటైర్ అయినప్పటికీ జ్ఞాపకాలను మరిచిపోలేని వ్యక్తి కథను ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం. ఈ మూవీకి అభిషేక్ జావ్కర్, మధు కలిపు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘రంగమార్తాండ’ లో శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, తనికెళ్ల భరణి కూడా కనిపించనున్నారు.