‘గద్దల‌కొండ గణేష్’ హిందీ రీమేక్ మూవీ ‘Bachchhan Paandey’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-04-12T00:57:39+05:30 IST

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘బచ్చన్ పాండే’. యాక్షన్ కామెడీగా ఫర్హద్ సామ్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

‘గద్దల‌కొండ గణేష్’ హిందీ రీమేక్ మూవీ ‘Bachchhan Paandey’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘బచ్చన్ పాండే’. యాక్షన్ కామెడీగా ఫర్హద్ సామ్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. సాజిద్ నడియడ్ వాలా నిర్మించాడు. ఈ చిత్రంలో బాబీ డియోల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సీ, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ‘బచ్చన్ పాండే’ సినిమా స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది.


వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గద్దల‌కొండ గణేష్’కు రీమేక్‌గా ‘బచ్చన్ పాండే’ తెరకెక్కింది. కోలీవుడ్ హిట్ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా ‘గద్దలకొండ గణేష్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘బచ్చన్ పాండే’ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 15నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘భారత్’తో సహా దాదాపుగా 240దేశాల్లోని ప్రజలకు ఈ మూవీ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘ఏప్రిల్ 15న అతిథి వస్తున్నాడు’’అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.



Updated Date - 2022-04-12T00:57:39+05:30 IST