విల్ స్మిత్ తరువాత వార్తల్లో మరో ఆస్కార్ విజేత! బలవంతంగా ముద్దాడిన కేసులో...

ABN , First Publish Date - 2022-04-14T20:49:50+05:30 IST

ఈ మధ్యే జరిగిన ఆస్కార్స్ వేడుకల్లో విల్ స్మిత్ అతి పెద్ద వార్తగా మారిపోయాడు. ఆయన అవార్డు అందుకున్న దాని కంటే ఎక్కువగా వ్యాఖ్యతని కొట్టడమే చర్చకు దారి తీసింది. అయితే, తాజాగా మరో ఆస్కార్ విజేత కూడా జనం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కాకపోతే, విల్ స్మిత్ లాగా క్యూబా గుడింగ్ జూనియర్ ఎమోషనల్ అవ్వటం వల్ల చిక్కుల్లో పడలేదు. కోరిక కంట్రోల్ చేసుకోలేక... ముద్దాడి... మూడేళ్లుగా ముప్పతిప్పలు పడుతున్నాడు!

విల్ స్మిత్ తరువాత వార్తల్లో మరో ఆస్కార్ విజేత! బలవంతంగా ముద్దాడిన కేసులో...

ఈ మధ్యే జరిగిన ఆస్కార్స్ వేడుకల్లో విల్ స్మిత్ అతి పెద్ద వార్తగా మారిపోయాడు. ఆయన అవార్డు అందుకున్న దాని కంటే ఎక్కువగా వ్యాఖ్యతని కొట్టడమే చర్చకు దారి తీసింది. అయితే, తాజాగా మరో ఆస్కార్ విజేత కూడా జనం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కాకపోతే, విల్ స్మిత్ లాగా క్యూబా గుడింగ్ జూనియర్ ఎమోషనల్ అవ్వటం వల్ల చిక్కుల్లో పడలేదు. కోరిక కంట్రోల్ చేసుకోలేక... ముద్దాడి... మూడేళ్లుగా ముప్పతిప్పలు పడుతున్నాడు!


గతంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న టాలెంటెడ్ నటుడు క్యూబా గుడింగ్ జూనియర్. ఆయన 2018లో న్యూయార్క్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో వెయిట్రస్‌ని బలవంతంగా ముద్దాడాడు. నోట్లో నోరు పెట్టి తాను చేసిన పాడు పనికి అప్పట్లో అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే, మూడేళ్లుగా ఆ కేసు కోర్టులో కొనసాగుతూనే ఉంది. అంతే కాకుండా 2018-19 సంవత్సరాల కాలంలో మరో ఇద్దరు మహిళలపై కూడా క్యూబా గుడింగ్ దాడి చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఇవేకాక ఓ రేప్ కేసు కూడా ప్రస్తుతం ఆస్కార్ విన్నర్ మెడ చుట్టూ బిగుసుకుని ఉంది. అన్ని వైపులా చట్టపరమైన ఒత్తిళ్లు పెరగటంతో క్యూబా గుడింగ్ చేసేది లేక న్యూయార్క్ నైట్‌క్లబ్ కేసులో నేరాన్ని అంగీకరించాడు. ఈ విధంగా చేయటం ద్వారా ఆయనకు అమెరికన్ చట్టాల ప్రకారం ఇమ్మీడియెట్‌గా అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. జైలుకెళ్లెందుకు 54 ఏళ్ల గుడింగ్‌కి మరికొన్నాళ్లు వ్యవధి దొరుకుతుంది. చూడాలి మరి, ఆస్కార్ విజేతకి చివరకు అన్ని అశ్లీల కేసులకు కలిపి ఎన్నేళ్లు శిక్ష పడుతుందో...   

Updated Date - 2022-04-14T20:49:50+05:30 IST