చెంప చెళ్లుమనిపించిన విల్‌స్మిత్.. ఫిర్యాదు ఇవ్వడానికి నిరాకరించిన హోస్ట్..

ABN , First Publish Date - 2022-03-28T23:21:30+05:30 IST

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్

చెంప చెళ్లుమనిపించిన విల్‌స్మిత్..  ఫిర్యాదు ఇవ్వడానికి నిరాకరించిన హోస్ట్..

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్‌ను మార్చి 27న ప్రదానం చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ అకాడమీ అవార్డుల వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించాడు. హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ హోస్ట్ క్రిస్ చెంప పగలగొట్టిన సంగతి తెలిసిందే. తనను కొట్టినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి క్రిస్‌ రాక్ నిరాకరించడని లాస్ ఏంజెలిస్ పోలీస్ డిపార్ట్‌మెంట్(ఎల్ఎపీడీ) తెలిపింది. ఈ సందర్భంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. 


‘‘ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విల్ స్మిత్, హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్ రాక్ చెంప పగలగొట్టాడు. ఈ ఘటన గురించి లాస్ ఏంజెలిస్ పోలీసులకు తెలుసు. కానీ, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి క్రిస్ నిరాకరించాడు. ఒక వేళ క్రిస్ ఫిర్యాదు ఇవ్వాలనుకుంటే పోలీసులు ఎల్లప్పుడు అతడికీ అందుబాటులో ఉంటారు’’ అని లాస్‌ఏంజెలిస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే..అంతకు ముందు అవార్డుల వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్ రాక్ ఆహుతులను నవ్వుల్లో ముంచెత్తేందుకు ప్రయత్నించాడు. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ ప్రస్తావనను తీసుకొచ్చాడు. ఈ వేడుకుకు జాడా జుట్టు పూర్తిగా తొలగించుకుని హాజరైంది. ‘జీ.ఐ.జెన్’ చిత్రంలో డెమి మూర్ పోషించిన పాత్రతో విల్‌స్మిత్ భార్యను పోల్చాడు. ‘జీ.ఐ.జెన్’ సీక్వెల్‌లో ఆమె నటించబోతుందా అంటూ హాస్యాన్ని పండించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆవేశానికి లోనైన విల్ స్మిత్ అతడి చెంప పగలగొట్టాడు. 


విల్ స్మిత్ భార్య పింకెట్ ‘అలోపేసియా’ అనే అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి జుట్టు ఊడిపోతుంటుంది. ఈ విషయాన్ని ఆమె బహిరంగంగా కూడా తెలిపింది.



Updated Date - 2022-03-28T23:21:30+05:30 IST