పవన్ కల్యాణ్ ‌ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చిన థమన్

ABN , First Publish Date - 2022-03-10T03:03:54+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎస్. థమన్. ‘భీమ్లా నాయక్’ సినిమా మొదలైనప్పటి నుండి నెటిజన్లకు తన మ్యూజిక్‌తో ట్రీట్ ఇస్తున్న థమన్.. తాజాగా ‘భీమ్లా నాయక్’..

పవన్ కల్యాణ్ ‌ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చిన థమన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎస్. థమన్. ‘భీమ్లా నాయక్’ సినిమా మొదలైనప్పటి నుండి నెటిజన్లకు తన మ్యూజిక్‌తో ట్రీట్ ఇస్తున్న థమన్.. తాజాగా ‘భీమ్లా నాయక్’ జూక్ బాక్స్‌తో మరోసారి తన గురించి మాట్లాడుకునేలా చేశారు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’.. ఈ రెండు చిత్రాలతో థమన్‌ని పవన్ కల్యాణ్ అభిమానులు ఎలా చూస్తున్నారో.. సోషల్ మీడియా ఉండేవారికి బాగా తెలుసు. థమన్ కూడా పవన్ అభిమానులకు హుషారు ఇచ్చేలా ట్వీట్స్ చేస్తూ.. తన సంగీతంతో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో తనని కూడా ఆరాధించేలా చేసుకుంటున్నారు.


తాజాగా విడుదల చేసిన జూక్ బాక్స్‌లో ఇప్పటి వరకు విడుదల చేయనటువంటి రెండు పాటలను కూడా యాడ్ చేయడంతో అభిమానులు థమన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆ పాటలని విడుదల చేయాలంటూ.. సినిమా విడుదలైనప్పటి నుండి థమన్‌ని అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. అలాంటి వారందరి కోరికను బుధవారం వదిలిన జూక్ బాక్స్‌తో థమన్ తీర్చేశారు. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.



Updated Date - 2022-03-10T03:03:54+05:30 IST