ఇషాని ఈసారైనా ఆదరిస్తారా?

ABN , First Publish Date - 2022-02-04T03:02:35+05:30 IST

బెంగుళూరులో పుట్టిపెరిగిన కేరళ అమ్మాయి ఇషా నాయర్‌ కోలీవుడ్‌లో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతంలో పలు తమిళ చిత్రాల్లో నటించినా కానీ, అవేమీ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు. గత యేడాది ఆమె నటించిన

ఇషాని ఈసారైనా ఆదరిస్తారా?

బెంగుళూరులో పుట్టిపెరిగిన కేరళ అమ్మాయి ఇషా నాయర్‌ కోలీవుడ్‌లో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతంలో పలు తమిళ చిత్రాల్లో నటించినా కానీ, అవేమీ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు. గత యేడాది ఆమె నటించిన ‘ఎంగడా ఇవ్వలవు నాలా ఇరుందీంగ’ అనే చిత్రంలో నటించినప్పటికీ ఇది కూడా ఆమెకు పేరు తెచ్చిపెట్టలేదు. ఈ క్రమంలో తాజాగా మరో తమిళ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. ‘బి.ఈ.బార్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కే మూవీలో అమెకు హీరోయిన్‌ అవకాశం వరించింది. సురేష్‌ రవి హీరోగా నటించే ఈ చిత్రానికి ఆర్‌డిఎం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై ఈషా నాయర్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈసారి కోలీవుడ్‌ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. 

Updated Date - 2022-02-04T03:02:35+05:30 IST