Brahmastra: బంపర్ ఆఫర్ రూ.100కే టికెట్!

ABN , First Publish Date - 2022-09-26T01:34:17+05:30 IST

బాలీవుడ్ సెలబ్రిటీస్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో, హీరోయిన్‌లుగా నటించిన సినిమా (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం

Brahmastra: బంపర్ ఆఫర్ రూ.100కే టికెట్!

బాలీవుడ్ సెలబ్రిటీస్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో, హీరోయిన్‌లుగా నటించిన సినిమా (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించాడు. ఫాక్స్‌స్టార్ స్టూడియోస్‌తో కలసి ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దక్షిణాది భాషల్లో ఈ మూవీని దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి సమర్పించాడు. ఈ సినిమాకు నేషనల్ సినిమా డే సందర్భంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.75కే టికెట్‌ను అందించడంతో దాదాపుగా 15లక్షల మంది సినిమా లవర్స్ ఈ మూవీని వీక్షించారు. టికెట్ ధర తక్కువగా ఉంటే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారని ‘బ్రహ్మాస్త్ర’ మేకర్స్ అర్థం చేసుకున్నారు. అందువల్ల తక్కువ ధరకే టికెట్‌ను అందిచాలని నిర్ణయించుకున్నారు.


నవరాత్రి సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ టికెట్‌ను రూ.100కే అందించనున్నామని చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 29వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కానీ, ప్రభుత్వ నియమ, నిబంధనల ఫలితంగా ఈ ఆఫర్ కొన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉండదు. హైదరాబాద్‌లో టికెట్‌ను రూ.112కే అందించే అవకాశం ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 238.2కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ రూ.250కోట్లను దాటే అవకాశం ఉంది. ‘బ్రహ్మాస్త్ర’ భారీ విజయం సాధించడంతో రాబోయే రెండు పార్ట్‌లపై దృష్టిసారించినట్టు దర్శకుడు అయాన్ ముఖర్జీ చెప్పాడు. ప్రస్తుతం స్క్రిఫ్ట్‌ను సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నాడు. ‘బ్రహ్మాస్త్ర’ రూ. 410కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అయినప్పటికి, ఈ ప్రాజెక్టు చేసేందుకు రణ్ బీర్, ఆలియా రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఈ సినిమా‌‌లో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.



Updated Date - 2022-09-26T01:34:17+05:30 IST