అమితాబ్ ముఖంపై ముద్దులు... అద్నాన్ సమీ kiss day స్పెషల్ ఫోటో!

ABN , First Publish Date - 2022-02-14T03:28:36+05:30 IST

ఫిబ్రవరీ 13న, అంటే... వాలెంటైన్స్ డే‌కు ఒక్క రోజు ముందు... ‘కిస్ డే’ జరుపుకుంటారు వెస్ట్రన్ కంట్రీస్‌లో. ఈ మధ్య మన దేశంలోనూ ముద్దు దినోత్సవం పాప్యులర్ అవుతోంది. అందుకే, సింగర్ అద్నాన్ సమీ ఓ స్పెషల్ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో అమితాబ్ కూడా ఉండటమే అందరికీ మరింత ఆసక్తి కలిగించిన విషయం.

అమితాబ్ ముఖంపై ముద్దులు... అద్నాన్ సమీ kiss day స్పెషల్ ఫోటో!

ఫిబ్రవరీ 13న, అంటే... వాలెంటైన్స్ డే‌కు ఒక్క రోజు ముందు... ‘కిస్ డే’ జరుపుకుంటారు వెస్ట్రన్ కంట్రీస్‌లో. ఈ మధ్య మన దేశంలోనూ ముద్దు దినోత్సవం పాప్యులర్ అవుతోంది. అందుకే, సింగర్ అద్నాన్ సమీ ఓ స్పెషల్ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో అమితాబ్ కూడా ఉండటమే అందరికీ మరింత ఆసక్తి కలిగించిన విషయం. 


2002లో అద్నాన్ సమీ తెరపై కనిపించిన వీడియో సాంగ్ ‘కభీ నహీ’. అందులో అద్నాన్‌కి తోడుగా బిగ్ బి కూడా స్టెప్పులు వేస్తాడు. పాటలో ఓ చోట ఇద్దరి ముఖాలపై లిప్ స్టిక్ మరకలు కనిపిస్తాయి. అమ్మాయిలు వార్ని ముద్దులతో ముంచేస్తారు. సరిగ్గా ఆ సమయంలోని తమ ముఖాల్ని వీడియో నుంచీ క్లోజప్‌లో క్యాప్చర్ చేసి... సమీ ఇంటర్నెట్‌లో ‘కిస్ పిక్’ని షేర్ చేశాడు! ‘‘అందరికీ ముద్దుల దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు! సోమవారం నాటి వాలెంటైన్స్ డే కోసం వెయిట్ చేస్తూ... ఆదివారం ఆల్రెడీ రొమాంటిక్ మూడ్‌లో ఉన్న నెటిజన్స్... అద్నాన్ సమీ, అమితాబ్‌ల ‘కిస్ పిక్’ చూసి ఫన్నీ కామెంట్స్ చేయటం మొదలెట్టారు!

Updated Date - 2022-02-14T03:28:36+05:30 IST