Salman Khan ఎదుట Katrina Kaifకు ప్రపోజ్ చేసిన విక్కీ కౌశల్.. పాత వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-11-08T21:03:37+05:30 IST

బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి వార్తలతో బాలీవుడ్ మీడియా హోరెత్తిపోతోంది.

Salman Khan ఎదుట Katrina Kaifకు ప్రపోజ్ చేసిన విక్కీ కౌశల్.. పాత వీడియో వైరల్

బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి వార్తలతో బాలీవుడ్ మీడియా హోరెత్తిపోతోంది. డిసెంబర్ ఏడున రాజస్థాన్‌లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందని, ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ స్నేహితురాలిగా పేరు పొందిన కత్రిన.. రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం సాగించింది. రణ్‌బీర్‌తో బ్రేకప్ అనంతరం విక్కీ కౌశల్‌కు చేరువైంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


ఈ నేపథ్యంలో పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన విక్కీ కౌశల్.. కత్రినను సరదాగా ఆటపట్టించాడు. వేదిక పైకి వచ్చిన కత్రినతో మాట్లాడుతూ.. `మీరు ఎందుకు విక్కీ కౌశల్ లాంటి మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోరు? ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కాబట్టి మీరు కూడా పెళ్లి గురించి ఆలోచించాలి` అని వ్యాఖ్యానించాడు. ఆ ఫంక్షన్‌కు హాజరైన సల్మాన్ ఆ ప్రశ్న విని షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఆ ప్రశ్న విన్న కత్రిన నవ్వుతూ `వాట్` అని అడిగింది. 






Updated Date - 2021-11-08T21:03:37+05:30 IST